E-Paper
Advertisement

Ayush Badoni : ఆయూష్ బదోనీపై లక్నోకి ఎంత నమ్మకమో… పర్ఫామెన్స్ కూడా సూపర్

Ayush Badoni : ఆయూష్ బదోనీపై లక్నోకి ఎంత నమ్మకమో… పర్ఫామెన్స్ కూడా సూపర్
Advertisement
Ayush Badoni

Ayush Badoni : ఆయూష్ బదోనీ 2022లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరపున ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సీజన్లో 18 ఇన్నింగ్స్ ఆడిన బదోనీ.. 289 పరుగులు చేసి ఇంప్రెస్ చేశాడు. 21 యావరేజ్‌తో 132 స్ట్రైక్ రేటుతో ఫర్వాలేదనిపించాడు. పైగా లాస్ట్ సీజన్లో ప్రామిసింగ్ గేమ్ ఫినిషర్‌గా ఓ గుర్తింపు దక్కించుకున్నాడు కూడా. ఫ్యాన్స్‌తో పాటు క్రిటిక్స్ కూడా ఆయూష్ బదోనీ ఆట తీరుపై ఇంప్రెస్ అయ్యారు.

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెంబర్ 3 పొజిషన్లో బ్యాటింగ్‌కు పంపించింది లక్నో జట్టు. కేఎల్ రాహుల్ ఔట్ అవడంతో.. బదోనీ కూడా బ్యాటింగ్ బాధ్యత తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 24 బంతుల్లోనే 43 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించాడు..

Advertisement

నిజానికి నాలుగో ఓవర్‌కే ఆయూష్ బదోనీని బ్యాటింగ్‌కు దింపడం నిజంగా ఆశ్చర్యమే. రబాడా, ట్రెంట్ బౌల్ట్ లాంటి బౌలర్స్‌ను ఎదుర్కోవడం అంటే మాటలు కాదు. సీనియర్లు, అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే ఫేస్ చేయగలరు. అయినా సరే ఆయూష్ పర్ఫామెన్స్‌పై జట్టు నమ్మకం పెట్టుకుంది.

ఆయూష్ బదోనీని ప్రత్యేకంగా నెంబర్ 3 పొజిషన్లో పంపించడానికి వేరే కారణం ఉంది. బదోనీ మంచి ఫినిషర్ అన్న పేరుంది. లాస్ట్ సీజన్‌లో చాలా మ్యాచులను గెలిపించాడు కూడా. అయితే, ఈ సీజన్‌లో ఫినిషర్‌గా ఇంప్రెస్ చేయలేకపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖర్లో వచ్చిన ఆయూష్.. 7 బంతుల్లో 18 పరుగులు చేశాడు. కాకపోతే అది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మ్యాచ్. ఆ తరువాత చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లో 88 పరుగులు చేయాల్సిన సమయంలో.. ఆయూష్ బదోనీ 18 బంతులు ఎదుర్కొని కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కూడా 24 బాల్స్ లో 30 పరుగులు చేసి 19వ ఓవర్లో హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. అందుకే, బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపించి.. ఆయూష్ నుంచి రిజల్ట్ రాబట్టాలనుకుంటున్నారు. 

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×