E-Paper
Advertisement

ఫామ్ లో లేని హెడ్ ను అన‌వ‌స‌రంగా కోహ్లీ గెలికారు..మీ కర్మకాలి ఫైన‌ల్స్ వ‌స్తే, RCBకి బడిత పూజే

ఫామ్ లో లేని హెడ్ ను అన‌వ‌స‌రంగా కోహ్లీ గెలికారు..మీ కర్మకాలి ఫైన‌ల్స్ వ‌స్తే, RCBకి బడిత పూజే
Advertisement

Head Vs Kohli:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా మే 22వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ విక్టరీ నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ (Travis Head Vs Virat Kohli ) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ట్రావిస్ హెడ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే విరాట్ కోహ్లీ ఘోరంగా అవమానించాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే దీనిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీ పరువు తీస్తున్నారు. వరల్డ్ క్లాస్ క్రికెటర్ అయి ఉండి, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా విదేశీ క్రికెటర్ హెడ్ ను అవమానించడం పెద్ద తప్పు అంటూ కోహ్లీని విలన్ చేస్తున్నారు.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

ఫామ్ లో లేని హెడ్ ను అన‌వ‌స‌రంగా కోహ్లీ గెలికారు.

Advertisement

ఉప్పల్ స్టేడియం వేదికగా ట్రావిస్ హెడ్ ను అవమానించిన సంఘటన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు పెద్ద ప్రమాదం అంటూ హెచ్చరికలు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కర్మకాలి బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైనల్స్ అహ్మదాబాద్ వేదికగా జరిగితే… హెడ్ చెలరేగే ప్రమాదం ఉందని వార్నింగ్స్‌ ఇస్తున్నారు. ప్రస్తుతం హెడ్ ఫామ్ లో లేడు. అలాంటి వ్యక్తిని గిల్లి మరి విరాట్ కోహ్లీ రెచ్చగొట్టాడు. పడుకున్న సింహాన్ని తన్ని మరి లేపాడు కోహ్లీ. దీని ప్రభావం ఫైనల్స్ లో ఖచ్చితంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మధ్య నిజంగానే ఫైనల్ జరుగుతే మాత్రం హెడ్ సెంచరీ చేస్తాడని చెబుతున్నారు.

2023 వన్డే వరల్డ్ కప్ ఫైన‌ల్ సీన్ రిపీట్ కానుందా ?

2023 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ జరిగింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్ అయింది. ఇందులో ఆస్ట్రేలియా డేంజర్ ఓపెనర్ హెడ్ 120 బంతుల్లో 137 పరుగులు సాధించాడు. దీంతో ఇండియా ఓడిపోవాల్సి వచ్చింది. ఇక లేటెస్ట్ గా కోహ్లీ అనవసరంగా హెడ్ ను గెలికాడు కాబట్టి.. ఫైనల్స్ లో రెచ్చిపోతాడని అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ లో ఇప్పటివరకు హెడ్…మూడు అర్థ సెంచరీలు మాత్రమే చేశాడు. మిగిలిన అన్ని మ్యాచ్ లలో విఫలమయ్యాడు. అయితే కోహ్లీ రెచ్చగొట్టిన నేపథ్యంలో హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మధ్య ఫైనల్ జరిగితే మాత్రం బడిత పూజ తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. ఐసీసీ కూడా ఇదే విష‌యాన్ని ప‌రోక్షంగా హెచ్చ‌రించింది. ఓ వీడియో పెట్టి వార్నింగ్ ఇచ్చింది. బ్యాటింగ్ తో పాటు, బౌలింగ్ లో హెడ్ రాణిస్తాడ‌ని పేర్కొంటూ వీడియో విడుద‌ల చేసింది.

Advertisement

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

 

?igsh=MW1vZ2ZmcHZvNHhlYg==

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×