E-Paper
Advertisement

Hasan Ali injury: హ‌స‌న్ అలీకి పెను ప్ర‌మాదం…క్యాచ్ ప‌ట్ట‌బోయి త‌ల ప‌గ‌ల‌గొట్టుకున్నాడు

Hasan Ali injury: హ‌స‌న్ అలీకి పెను ప్ర‌మాదం…క్యాచ్ ప‌ట్ట‌బోయి త‌ల ప‌గ‌ల‌గొట్టుకున్నాడు
Advertisement

Hasan Ali injury: పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (Bangladesh vs Pakistan) మధ్య ఇవాళ రెండో టెస్టు ప్రారంభమైంది. సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Sylhet International Cricket Stadium, Sylhet) వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని పాకిస్తాన్ నిర్ణయం తీసుకోగా… బంగ్లాదేశ్ బ్యాటింగుకు దిగింది. అయితే, ఈ మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పాకిస్తాన్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్ స్టార్ బౌలర్ హసన్ అలీ (Hasan Ali) తలకు తీవ్రమైన గాయం చోటు చేసుకుంది. క్యాచ్ పట్టబోయి, తలకు దెబ్బ (Hasan Ali’s head injury ) తగిలించుకున్నాడు. దీంతో వెంటనే హ‌సన్ అలీని స్ట్రెచ‌ర్ పైన ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

హ‌స‌న్ అలీకి పెను ప్ర‌మాదం…క్యాచ్ ప‌ట్ట‌బోయి త‌ల ప‌గ‌ల‌గొట్టుకున్నాడు

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) మధ్య 9:30 గంటల ప్రాంతంలో రెండో టెస్ట్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికి హసన్ అలీ (Hasan Ali) గాయపడ్డాడు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి.. మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఇక బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 8 ఓవర్ నేపథ్యంలో హసన్ అలీ ప్రమాదానికి గురైయ్యాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ తంజీద్ హసన్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టుకునేందుకు హసన్ అలీ ప్రయత్నించాడు. బౌలింగ్ వేసిన వెంటనే క్యాచ్ రావడంతో… కుడి వైపు డైవ్ చేశాడు హసన్ అలీ. ఈ క్రమంలోనే అతని తల, నుదుటి భాగానికి గట్టి దెబ్బ తగిలింది. గాయమైన తర్వాత అతడు నిల‌బ‌డ‌లేకపోయాడు. మైదానంలోనే కుప్పకూలి విలవిలలాడిపోయాడు. దీంతో మెడికల్ టీం రంగంలోకి దిగి స్ట్రెచ‌ర్ పై అతన్ని మైదానం నుంచి ఆసుపత్రికి తరలించారు. ఇక ఆ ఓవర్ లోని మిగిలిన ఒక బంతిని సల్మాన్ అలీ అఘా వేయడం జరిగింది. ఈ సంఘ‌ట‌నతో పాకిస్తాన్ ప్లేయ‌ర్లు ( Pakistan Players) ఉలిక్కి ప‌డ్డారు.

తిరిగి బౌలింగ్ చేసేందుకు వ‌చ్చేసిన హ‌స‌న్ అలీ

పాకిస్తాన్ బౌలర్ హసన్ అలీ గాయపడిన తర్వాత.. అతనికి మెరుగైన ట్రీట్మెంట్ అందించారు. ఇదే దెబ్బ తీవ్రమైనది కాకపోవడంతో వెంటనే కోలుకున్నాడు హసన్ అలీ. ఈ క్రమంలోనే మళ్లీ మైదానంలోకి వచ్చిన అలీ.. బౌలింగ్ కూడా చేస్తున్నాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఇది ఇలా ఉండగా, ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ 28 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో మూడు వికెట్ల నష్టానికి 104 పరుగులు సాధించింది. నజ్ముల్ హుస్సేన్ సాంటో అలాగే ముష్ఫికర్ రహీం బ్యాటింగ్ చేస్తున్నారు.

Advertisement

 

Also Read: రాజీవ్ శుక్లా భాగోతం బ‌య‌ట‌పెట్టిన ల‌లిత్ మోడీ…ఐపీఎల్ లో ఛాన్స్ ఇస్తామ‌ని డ‌బ్బులు వ‌సూళ్లు, ప్రైవేట్ వీడియోలు చూపించి !

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×