E-Paper
Advertisement

IPL 2026-KKR: కేకేఆర్ లో వేలుపెట్టిన గంభీర్‌…హ‌ర్షిత్ రాణాకు కెప్టెన్సీ ?

IPL 2026-KKR: కేకేఆర్ లో వేలుపెట్టిన గంభీర్‌…హ‌ర్షిత్ రాణాకు కెప్టెన్సీ ?
Advertisement

IPL 2026-KKR:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( IPL 2026) సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి నేపథ్యంలో మినీ వేలానికి సిద్ధమవుతున్నాయి 10 ఫ్రాంచైజీలు. ఈ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మినీ వేలం జరగనుంది. దీంతో, ఏ ప్లేయర్ ను వదిలివేయాలి? ఏ ప్లేయర్ ను వేలంలో కొనుగోలు చేయాలి అనే దానిపైన కసరత్తులు మొదలుపెట్టాయి 10 ఫ్రాంచైజీలు. ఇలాంటి నేపథ్యంలో కేకేఆర్ జట్టు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. హర్షిత్ రాణాకు కెప్టెన్సీ ఇవ్వాల‌ని కేకేఆర్ జ‌ట్టు యాజ‌మాన్యం నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. గౌత‌మ్ గంభీర్ సూచ‌న‌ల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ట కేకేఆర్‌. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Amol Muzumdar: ఒక్క మ్యాచ్ టీమిండియాకు ఆడ‌లేదు.. కానీ వ‌ర‌ల్డ్ క‌ప్ తీసుకొచ్చాడు.. ఎవ‌రీ అమోల్ ముజుందార్ ?

కేకేఆర్ లో వేలుపెట్టిన గంభీర్‌

Advertisement

టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ప్రతి విషయంలో వేలు పెడుతున్నారు. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ పూర్తిగా డిస్టర్బ్ చేస్తున్న గౌతమ్ గంభీర్, ఇప్పుడు హర్షిత్ రాణా కోసం తెగించారు. కేకేఆర్ జట్టు కెప్టెన్ గా హర్షిత్ రాణాను చేయాలని షారుక్ ఖాన్ కు సూచనలు చేశారంట గౌతమ్ గంభీర్. గతంలో గౌతమ్ గంభీర్ కేకేఆర్ కోచ్ గా పని చేశారు. అతని సారథ్యంలోనే పలుసార్లు కేకేఆర్ ఛాంపియన్ గా కూడా నిలిచింది. ఇలాంటి నేపథ్యంలోనే టీమిండియా హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్ ఏది చెబితే అది వింటోంది కేకేఆర్‌ యాజమాన్యం. ఇందులో భాగంగానే ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కోసం కేకేఆర్ కెప్టెన్ గా హర్షిత్ రాణాను ఫైనల్ చేయాలని గౌతమ్ గంభీర్ పేర్కొన్నారట.

ఐపీఎల్ 2026 లో భారీ మార్పులు

ఐపీఎల్ 2026 టోర్నమెంట్‌ మార్చిలో జరగనున్న సంగతి తెలిసిందే. మార్చి 15వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ మాసంలో మినీ వేలం నిర్వహించనున్నారు. అయితే ఇందులో తమ జట్టులో ఉన్న కొంతమంది ప్లేయర్లను వదిలివేయాలని కేకేఆర్ భావిస్తుందట. రహానేతో పాటు మరికొంతమందిని వదిలేస్తున్నారట. అదే సమయంలో కేఎల్ రాహుల్ ను జట్టులోకి తీసుకురావాలని కేకేఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఢిల్లీ మాత్రం దీనికి అసలు ఒప్పుకోవడం లేదట. రింకూ సింగ్ తో పాటు రమణదీప్ సింగ్ ఇద్దరిని కూడా ఢిల్లీకి ఇవ్వాలని కోరుతోందట. అప్పుడే కేఎల్ రాహుల్ ను ఇస్తామని ఢిల్లీ తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి కేకేఆర్ ను చెప్పినట్లు తెలుస్తోంది. నవంబర్ 15వ తేదీ లోపు దీనిపై క్లారిటీ వస్తుంది. ఇక ఇప్పుడు హర్షిత్ రాణాకు కెప్టెన్సీ ఇస్తారని కూడా చర్చ జరుగుతోంది.

Advertisement

Also Read: Womens World Cup 2025: 1983లో క‌పిల్, 2024లో సూర్య.. ఇప్పుడు అమన్‌జోత్..ఈ 3 క్యాచ్ లు టీమిండియా రాత మార్చేశాయి

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×