E-Paper
Advertisement

T20 World Cup 2026 India Squad: గిల్ ను తీసేశారు, కానీ హ‌ర్షిత్ రాణాను ట‌చ్ చేస్తే మాడి మ‌సైపోతారు

T20 World Cup 2026 India Squad: గిల్ ను తీసేశారు, కానీ హ‌ర్షిత్ రాణాను ట‌చ్ చేస్తే మాడి మ‌సైపోతారు
Advertisement

T20 World Cup 2026 India Squad: 2026 టి-20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి {BCCI} అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టులో యంగ్ ప్లేయర్, టెస్ట్, వన్డే కెప్టెన్ గిల్ ని పూర్తిగా జట్టుకు దూరం చేసిన విషయం తెలిసిందే. టి-20లలో కూడా ఇప్పటివరకు వైస్ కెప్టెన్ గా కొనసాగిన బాధ్యతల నుంచి తప్పించింది బీసీసీఐ. అతడి ఫామ్ పై సెలెక్టర్లు అసంతృప్తిగా ఉన్నారనే విషయం ఈ నిర్ణయంతో స్పష్టంగా తెలిసింది.

Also Read: The Ashes 2025-26: మళ్లీ ఇంగ్లండ్ ఓటమి.. యాషెస్ సిరీస్‌ ఆసీస్ వశం

Advertisement

గిల్ కంటే ఓపెనింగ్ స్థానంలో సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ల ఆటపై సెలక్టర్లు ఎక్కువగా నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. అందుకే గిల్ ని తప్పించినట్లు సమాచారం. అయితే ఫామ్ లో లేని కారణంగా గిల్ ని పక్కన పెట్టారు కానీ.. మరొక ఆటగాడిని మాత్రం ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా కొనసాగిస్తున్నారు. అతడు మరెవ్వరో కాదు హర్షిత్ రాణా.

 

హర్షిత్ రాణా ని టచ్ చేయలేరా..?

Advertisement

యంగ్ పేసర్ హర్షిత్ రాణా ప్రస్తుతం ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. గతంలో కూడా ఇతడికి ఎక్కువగా అవకాశాలు రావడం పై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వచ్చాయి. ఐపీఎల్ లో కలకత్తా నైట్ రైడర్స్ తరఫున ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో కలిసి పనిచేసిన హర్షిత్ రానా.. ఇప్పుడు భారత జట్టులో మూడు ఫార్మాట్లలో కూడా అవకాశాలు పొందుతున్నాడు. అయితే ఇతడు సరిగ్గా ఆడకపోయినా అన్ని ఫార్మాట్లలో అవకాశాలు రావడం, దానిపై సోషల్ మీడియాలో టోల్స్ రావడం పై గౌతమ్ గంభీర్ కూడా రియాక్ట్ అయ్యాడు.

హర్షిత్ రానా టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 లో ఉండడానికి అసలైన కారణం ఏంటో కూడా గతంలోనే రివీల్ చేశాడు. ” హర్షిత్ రానా కేవలం పేస్ బౌలర్ మాత్రమే కాదు. ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ చేయగల నమ్మకమైన ప్లేయర్. 2027 వన్డే వరల్డ్ కప్ ని దృష్టిలో ఉంచుకొని టీం బ్యాలెన్స్ కోసం అతడిని తయారు చేస్తున్నాం. అతడు ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ చేయగలగడం, బౌలింగ్ లో వికెట్లు తీయగలడం కీలకం. రెండు సంవత్సరాల తర్వాత సౌత్ ఆఫ్రికాలో వరల్డ్ కప్ ఉంటుంది. అక్కడ ముగ్గురు పేసర్లతోనే ఆడాలి. అందుకే హర్షిత్ రానా వంటి బౌలింగ్ ఆల్ రౌండర్ ని రెడీ చేస్తున్నాం”. అని చెప్పుకొచ్చాడు.

 

గంభీర్ కారణంగానే హర్షిత్ రాణా కి అవకాశాలు ఇస్తున్నారా..?

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ – హర్షిత్ రానాల సంబంధం కలకత్తా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ కాలం నాటిది. టీమిండియా హెడ్ కోచ్ కావడానికి ముందు గౌతమ్ గంభీర్ కేకేఆర్ జట్టుకు మెంటార్ గా పనిచేశాడు. ఆ సమయంలో హర్షిత్ రానా కూడా అదే జట్టు తరుపున ఆడాడు. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్ అయ్యాడు. దీంతో హర్షిత్ రానా కి ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అరంగేట్రం చేసే అవకాశం కల్పించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన టి-20, వన్డే సిరీస్ లలో కూడా అరంగేట్రం చేసే అవకాశాన్ని కల్పించాడు.

Also Read: Shubman Gill Injury: గాయం అంటూ గిల్‌, గంభీర్ డ్రామాలు..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి తొల‌గించ‌డం వెనుక అస‌లు ర‌హ‌స్యం ఇదే!

ఆశ్చర్యకరంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ లతో ఆడే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టులో కూడా ఎంపిక చేశాడు. ఇదే ట్రోఫీలో లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ని టోర్నమెంట్ అంతా బెంచ్ కి పరిమితం చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే, టి-20 సిరీస్ లలో కూడా అదే ట్రెండ్ కనిపించింది. ఇక తాజాగా సౌత్ ఆఫ్రికా తో జరిగిన మూడు ఫార్మాట్లలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక ఇప్పుడు టి-20 వరల్డ్ కప్ కి కూడా హర్షిత్ రానా కి అవకాశం కల్పించడం చర్చకు దారితీస్తోంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×