E-Paper
Advertisement

Harshit Rana: గంభీర్‌ కొడుకు హ‌ర్షిత్ రాణా దూల తీర్చిన ఐసీసీ.. ఈ వెధ‌వ ప‌నులు త‌గ్గించుకో అంటూ

Harshit Rana: గంభీర్‌ కొడుకు హ‌ర్షిత్ రాణా దూల తీర్చిన ఐసీసీ.. ఈ వెధ‌వ ప‌నులు త‌గ్గించుకో అంటూ
Advertisement

Harshit Rana: టీమిండియా స్టార్ పేసర్ హర్షిత్ రాణా వివాదంలో చిక్కుకున్నాడు. మైదానంలో తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ప్రత్యర్థి ఆటగాడికి సైగలు చేయడంతో హర్షిత్ రాణాకి ఐసీసీ షాక్ ఇచ్చింది. రాంచీ వేదికగా సౌత్ ఆఫ్రికాతో నవంబర్ 30వ తేదీన జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో హర్షిత్ ఐసిసి ప్రవర్తనా నియమావలిని ఉల్లంఘించాడు.

Also Read: Mike Hussey: CSK డ్రెస్సింగ్ రూంలో హుక్కా కొడతారు.. ధోని బండారం బయటపెట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్

Advertisement

సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డేవాల్డ్ బ్రేవీస్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు హర్షిత్. దీంతో ఓ డీమెరిట్ పాయింట్ జోడించి.. 24 నెలల్లో మొదటి తప్పిదం కావడంతో మందలింపుతో వదిలేసింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఆటగాళ్లపట్ల దురుసుగా ప్రవర్తించడం ఆర్టికల్ 2.5 ఉల్లంఘన కిందికి వస్తుంది.

 

డ్రెస్సింగ్ రూమ్ వైపు వేలు చూపించిన హర్షిత్ రాణా:

Advertisement

నవంబర్ 30న రాంచి వేదికగా భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లోని 22వ ఓవర్ లో డేవాల్డ్ బ్రేవిస్ ని అవుట్ చేసిన తరువాత అత్యుత్సాహానికి గురైన హర్షిత్ రాణా.. బ్యాటర్ బ్రేవిస్ కి డ్రెస్సింగ్ రూమ్ వైపు వేలు చూపిస్తూ సైగ చేశాడు. ఈ ఘటనతో ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్షిత్ ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ ని చేర్చింది. గత 24 నెలల్లో అతడు చేసిన తొలి తప్పిదం కావడంతో మందలించి వదిలేసింది. మైదానంలో ప్లేయర్లు ఇలాంటివి చేయడం నిబంధనలకు విరుద్ధం. ఇలాంటి ప్రవర్తనకు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. యువ ఆటగాడైన బ్రేవిస్ పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు. ఐసీసీ రూల్స్ ప్రకారం బ్యాటర్ అవుట్ అయిన తర్వాత అతిగా ప్రవర్తించడం నేరం. ఇప్పటికే ఐపీఎల్ లో ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్స్ తో హర్షిత్ రానా ఓ మ్యాచ్ లో నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ లోనూ బ్యాటర్లను ఇలా రెచ్చగొట్టేలా అసభ్యకర సైగలు చేస్తున్నాడు.

Also Read: IND VS SA 1st ODI: ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌ను బండ‌బూతులు తిట్టిన కోహ్లీ.. షాకింగ్ వీడియో ఇదిగో

 

హర్షిత్ రానాకి ఇలాంటి ఓవరాక్షన్ చేయడం కొత్తేమీ కాదు:

గతంలో దేశవాలి, ఐపీఎల్ టోర్నీలలోనూ చాలా సందర్భాలలో హర్షిత్ రానా ఇలాగే ప్రవర్తించాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఆయుష్ దోసేజా, ఐపీఎల్ లో మయాంక్ అగర్వాల్ పట్ల దురుసుగా ప్రవర్తించినప్పుడు క్రికెట్ సమాజం హర్షిత్ రానా పై దుమ్మెత్తి పోసింది. అయినప్పటికీ తన తీరు మార్చుకోకుండా హర్షిత్ రానా.. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో డేవాల్డ్ బ్రేవీస్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. భవిష్యత్తులో హర్షిత్ రానా ఇలాంటి ప్రవర్తన కొనసాగిస్తే తీవ్రంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. అలాగే అతడి కెరీర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇలాంటి ప్రవర్తనతో చాలామంది క్రికెటర్లు తమ కెరీర్లను నాశనం చేసుకున్నారు. కాబట్టి హర్షిత్ రానా ఇకనుండి అయిన తన ప్రవర్తన మార్చుకుంటే మంచిదని సూచిస్తున్నారు నెటిజెన్లు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×