E-Paper
Advertisement

Hardik Pandya : హార్దిక్ లేని లోటు ఇప్పుడు తెలిసి వస్తోందా?

Hardik Pandya : హార్దిక్ లేని లోటు ఇప్పుడు తెలిసి వస్తోందా?
Advertisement
Hardik Pandya

Hardik Pandya : ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ పై రకరకాల కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ టైమ్ లో హార్ధిక్ పాండ్యా ఉంటే ఎంత బాగుండేదని అనుకుంటున్నారు. ఒకవైపు పిచ్ బ్యాటింగ్ కి అనువుగా లేదు. బాల్ బాల్ కి కఠినంగా మారిపోతోంది. బ్యాటర్లు సింగిల్స్ తీయడానికి కూడా కష్టపడుతున్నారు.

సముద్రమంతా ఈదిన గజ ఈతగాడు చిన్న గోతిలో పడి డెబ్బలు తగిలించుకున్నట్టు, టీమ్ ఇండియా అన్నింటా విజయ పతాకాన్ని ఎగురవేసి, చివరి మెట్టు దగ్గర పల్టీ కొట్టింది. ఈ నేపథ్యంలో అందరికీ హార్దిక్ పాండ్యా గుర్తొస్తున్నాడు. నిజానికి తనే గానీ ఉండి ఉంటే…

Advertisement

వికెట్లు పడుతున్నప్పుడు రవీంద్ర జడేజా బదులు హార్దిక్ వచ్చేవాడు. కాసేపు వికెట్ల పతనాన్ని నిలువరించేవాడని అంటున్నారు. అంతేకాదు బౌలింగ్ లో కూడా ఐదుగురి బౌలర్లు ప్రభావం చూపించలేకపోతున్న సమయంలో హార్దిక్ వైపు రోహిత్ చూసేవాడని అంటున్నారు. రెండు విధాల ఆదుకునే హార్దిక్ ఆ సమయంలో లేకపోవడం ఇప్పుడు తెలిసొచ్చిందని అంటున్నారు.

తీవ్ర గాయంతో వెనుతిరిగిన హార్దిక్ మళ్లీ వన్డే వరల్డ్ కప్ గేమ్ లో కనిపించలేదు. అయితే తన ప్లేస్ లో వచ్చిన షమీ బౌలింగ్ విభాగంలో ఆ లోటు లేకుండా చేశాడు. కానీ బ్యాటింగ్ లోకి వచ్చిన సూర్యకుమార్ మాత్రం తేలిపోయాడు. అయితే తనకి కూడా అవకాశాలు రాలేదు. వచ్చిన ఫైనల్ మ్యాచ్ లో చేతులెత్తేశాడు.

Advertisement

శార్దూల్ ఠాకూర్ ప్లేస్ లో వచ్చిన షమీ తన బాధ్యతలను నూటికి నూరుశాతం అందించాడు. అంతవరకు ఓకే కానీ, సూర్య ఫైనల్ మ్యాచ్ చివర్లో టీ 20 స్లయిల్ లో ఆడి ఉంటే, మరో 30, 40 పరుగులు వచ్చేవి. అప్పుడు ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెరిగేది. అన్ని బాల్స్ డిఫెన్స్ ఆడేవారు కాదని అంటున్నారు. ఏదొకటి రిస్క్ తీసుకునేవారని చెబుతున్నారు.

ఇక హార్దిక్ పాండ్యాకు మరోక దెబ్బ ఏమిటంటే ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ కి కెప్టెన్ గా ఉండాల్సిన వాడు, ఆ ఛాన్స్ కూడా పోయింది. కాలుకి ఆపరేషన్ చేయాల్సి వస్తుందని కూడా అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మరో ఆరునెలల్లో ప్రారంభమయ్యే టీ 20 వరల్డ్ కప్ కైనా రెడీ అవుతాడా ? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×