E-Paper
Advertisement

Hardik Pandya: హార్దిక్ పాండ్యా యూట‌ర్న్‌..మాజీ భార్య నటాషాకు రూ.4 కోట్ల గిఫ్ట్, షాక్ లో మ‌హికా శ‌ర్మ‌!

Hardik Pandya:  హార్దిక్ పాండ్యా యూట‌ర్న్‌..మాజీ భార్య నటాషాకు రూ.4 కోట్ల గిఫ్ట్, షాక్ లో మ‌హికా శ‌ర్మ‌!
Advertisement

Hardik Pandya: టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా టి20 జట్టులో అద్భుతంగా రాణిస్తున్న హార్దిక్ పాండ్యా… ప్రస్తుతం మహికా శర్మతో ( mahieka sharma) ప్రేమలో ఉన్నాడు. త్వరలో ఆమెను పెళ్లి కూడా చేసుకోబోతున్నాడట హార్దిక్ పాండ్యా. ఇప్పటికే ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తన ప్రియురాలు మహికా శర్మకు ఊహించని సాగించాడట హార్దిక్ పాండ్యా. మహిక శర్మకు తెలియకుండా తన మాజీ భార్య నటాషా ( Natasa Stankovic ) అలాగే ఆగస్త్య పాండ్యా కు ( Agastya Pandya) ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడట ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. తల్లి కొడుకులకు నాలుగు కోట్లు పెట్టి ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు ( 2026 Land Rover Defender) గిఫ్ట్ గా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: NZ vs Pak Super 8: కొంప ముంచిన వ‌ర్షం, తొలి సూప‌ర్ 8 మ్యాచ్ ర‌ద్దు..పాకిస్తాన్ సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు

మాజీ భార్య నటాషాకు రూ.4 కోట్ల గిఫ్ట్, షాక్ లో మ‌హికా శ‌ర్మ‌!

Advertisement

హార్దిక్ పాండ్యా అలాగే నటాషా ఇద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కాపురం చేసిన ఈ జంట, రెండు సంవత్సరాల కిందట విడిపోయింది. గత ఐపీఎల్ సందర్భంగా అధికారికంగా విడాకులు కూడా తీసుకుంది హార్దిక్ పాండ్యా, నటాషా జంట. అయితే అప్పటికే ఈ జంటకు అగస్త్య పాండే పుట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ గుండె రాయి చేసుకుని విడాకులు తీసుకున్నారు. ఇక తన భార్య నటాషాకు విడాకులు ఇచ్చిన హార్దిక్ పాండ్యా, ప్రస్తుతం మహికా శర్మను ప్రేమిస్తున్నాడు. త్వరలో ఈ ఇద్దరు పెళ్లికూడా చేసుకోబోతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో హార్దిక్ పాండ్యా యూటర్న్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన మొదటి భార్య నటాషా అలాగే కుమారుడు అగస్త్య పాండ్యాకు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు గిఫ్ట్ గా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీని విలువ దాదాపు నాలుగు కోట్లు అని సమాచారం. అయితే తాజాగా ఆ కారు కొనుగోలు చేస్తున్నప్పుడు అగస్త్య పాండ్యా అలాగే నటాషా దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో హార్దిక్ పాండ్యానే ఈ కారు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అతడే ఈ గిఫ్ట్ ఇచ్చాడ‌ని అంటున్నారు. . ఈ వార్త బయటకు రావడంతో హార్దిక్ పాండ్యా యూటర్న్ తీసుకున్నాడని.. త్వరలోనే తన మొదటి భార్య వద్దకు మళ్లీ వెళ్తాడని జోరుగా ప్రచారం అందుకుంది. ఇది ఇలా ఉండ‌గా, ఇటీవ‌లే పాండ్యా ప్రియురాలు మహికా శ‌ర్మ పుట్టిన రోజు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్బంగా మహికా శ‌ర్మ పేరు క‌నిపించేలా  M అనే టాటూ కూడా వేయించుకున్నాడు పాండ్యా.

Advertisement

 

Also Read: Ban Players Coma: టీ20 ప్ర‌పంచ క‌ప్ ఎఫెక్ట్..సంక్షోభంలో బంగ్లాదేశ్ క్రికెట్‌…కోమాలోకి వెళ్లిన‌ ఇద్ద‌రు ఆట‌గాళ్లు

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×