E-Paper
Advertisement

IPL 2025: CSK ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్… ఇక ఫ్రీ బస్!

IPL 2025: CSK ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్… ఇక ఫ్రీ బస్!
Advertisement

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 18వ సీజన్ మార్చి 22 నుండి ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని జట్లు సిద్ధమయ్యాయి. ప్రాక్టీస్ ని ముమ్మరం చేశాయి. ఈ సీజన్ కోసం పది జట్ల కెప్టెన్లను ఇప్పటికే నిర్ణయించారు. ఇక సోషల్ మీడియాలోనూ అన్ని ఫ్రాంచైజీలు దూకుడు పెంచాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా మరోసారి ట్రోఫీ లక్ష్యంగా ఈ సీజన్ లో బరిలోకి దిగుతుంది.

 

Advertisement

ఐదుసార్లు ఛాంపియన్, మూడుసార్లు తప్ప ప్రతిసారి ప్లే ఆఫ్స్ కి చేరిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్ లో మరోసారి కప్పు కొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ గత సంవత్సరం మాత్రం పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది. కనీసం ప్లే ఆఫ్ కి కూడా చేరకుండా ఐదవ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఈసారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో అద్భుత రికార్డు నమోదయింది. గురువారం చెన్నై సూపర్ కింగ్స్ ఓ అరుదైన ఘనతను సాధించింది.

ఇంస్టాగ్రామ్ లో 17 మిలియన్ల మంది ఫాలోవర్ల మైలురాయిని చేరుకుంది. దీంతో ఇలా అత్యధిక ఫాలోవర్లు కలిగిన మొదటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టుగా నిలిచింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ లలో కూడా బలమైన ఉనికిని కలిగి ఉంది. ఫేస్బుక్ లో 14 మిలియర్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే ట్విట్టర్ లో 11 మిలియన్లు, యూట్యూబ్ లో కూడా బలమైన ఫాలోయింగ్ ని కలిగి ఉంది సిఎస్కే. ఇక మార్చి 23 ఆదివారం సాయంత్రం చెన్నైలోని తమ సొంత మైదానం చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో పోటీపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధం అవుతుంది.

Advertisement

తమ రికార్డు ఆరవ ఐపీఎల్ టైటిల్ ని గెలుచుకునేందుకు పావులు కదుపుతుంది. ఈ ఏడాది రుతురాజ్ గైక్వాడ్ సారధ్యంలో బరిలోకి దిగబోతోంది. తొలి మ్యాచ్ లోనే విజయం సాధించి ఈ సీజన్ ని గ్రాండ్ గా ప్రారంభించాలని చూస్తోంది. ఇక మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ అభిమానుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్ లు ప్రారంభమయ్యే మూడు గంటల ముందు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది.

ఈ సీజన్ అంతా ఇది వర్తించనుందని తెలిపింది. దీంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ చాలా ప్రేమను తిరిగి ఇస్తుందంటూ ఎల్లో ఆర్మీ పొగడ్తలు కురిపిస్తోంది. CSK IPL 2025 జట్టు: రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరణ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోని, డెవాన్ కాన్వే (రూ. 6.25 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ. 3.40 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు), ఆర్. 9. ఆర్. ఖామెద్. 5 కోట్లు. 4.80 కోట్లు),

 

నూర్ అహ్మద్ (రూ. 10 కోట్లు), విజయ్ శంకర్ (రూ. 1.20 కోట్లు), సామ్ కరన్, (రూ. 2.40 కోట్లు), షేక్ రషీద్ (రూ. 30 లక్షలు), అన్షుల్ కాంబోజ్ (రూ. 3.40 కోట్లు), ముఖేష్ చౌదరి (రూ. 3.40 కోట్లు), దీపస్ చౌదరి (రూ. కోటి 30), దీపస్ హూడా. 7 కోట్లు. సింగ్ (రూ. 2.20 కోట్లు), నాథన్ ఎల్లిస్ (రూ. 2 కోట్లు), జామీ ఓవర్టన్ (రూ. 1.50 కోట్లు), కమలేష్ నాగరకోటి (రూ. 30 లక్షలు), రామకృష్ణ ఘోష్ (రూ. 30 లక్షలు), శ్రేయాస్ గోపాల్ (రూ. 30 లక్షలు), వంశ్ బేడి (రూ. 55 లక్షలు), ఆండ్రీ సిద్దార్థ్ (రూ. 30 లక్షలు).

Tags

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×