E-Paper
Advertisement

Kuldeep Yadav-Gambhir: భార్య ముందే కుల్దీప్ ను బండ బూతులు తిట్టిన‌ గంభీర్‌..ఇంత ఓవ‌రాక్ష‌న్ అవ‌స‌ర‌మా అంటూ

Kuldeep Yadav-Gambhir: భార్య ముందే కుల్దీప్ ను బండ బూతులు తిట్టిన‌ గంభీర్‌..ఇంత ఓవ‌రాక్ష‌న్ అవ‌స‌ర‌మా అంటూ
Advertisement

Kuldeep Yadav-Gambhir: టీమిండియా స్టార్ ఆటగాడు కుల్దీప్ యాదవ్ ( Kuldeep Yadav) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టీమిండియాలో అగ్రశ్రేణి బౌలర్ గా కొనసాగుతూ ఇరగదీస్తున్నాడు. అయితే అలాంటి కుల్దీప్ యాదవ్ ఇటీవల పెళ్లి పీటలు ఎక్కాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక చద్దాను ( Vanshika Chadha) పెళ్లాడాడు. మార్చి 14వ తేదీన ముస్సోరీ వేదికగా కుల్దీప్ యాదవ్, వంశిక చద్దా వివాహం జరిగింది. ఇక మార్చి 17వ తేదీన ఈ జంట పెళ్లి రిసెప్షన్ ( Kuldeep Yadav Wedding Reception ) కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కుల్దీప్ యాదవ్ కు రిసెప్షన్ వేదిక పైన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) వార్నింగ్ ఇచ్చినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. భార్య ముందే కుల్దీప్ ను బండ బూతులు గంభీర్ తిట్టాడ‌ని అంటున్నారు. దీంతో గౌతమ్ గంభీర్ పై కుల్దీప్ యాదవ్ అభిమానులు సీరియస్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఏదైనా ఉంటే గ్రౌండ్ లో చూసుకోవాలి కానీ.. స్టేజ్ పైన మీ ఓవరాక్షన్ ఏంటి? అంటూ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

Also Read: Moin Khan: ఐపీఎల్ అంటేనే బ్లాక్ మ‌నీ దందా, ఫిక్సింగ్..PSL ముందు నాలుక గీసుకోవ‌డానికి కూడా ప‌నికిరాదు

భార్య ముందే కుల్దీప్ ను బండ బూతులు తిట్టిన‌ గంభీర్‌

Advertisement

తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక చద్దాను పెళ్లి చేసుకున్న టీమిండియా స్టార్ ఆటగాడు కుల్దీప్ యాదవ్, లేటెస్ట్ గా రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్ గా పెట్టుకున్నాడు. లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీలో ఉన్న లగ్జరీ హోటల్ ది సెంట్రల్ లో కుల్దీప్ యాదవ్, వంశిక చద్దా పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఈ ఈవెంట్ కు టీమిండియా క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా హాజరయ్యారు. అటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రతిపక్ష నేత ఎస్పి అధినేత అఖిలేష్ యాదవ్ కూడా హాజరై సందడి చేశారు. అయితే కుల్దీప్ యాదవ్ దంపతులతో ఫోటోలు దిగేందుకు స్టేజ్ పైకి ఎక్కిన గౌతమ్ గంభీర్ అందరికీ షాక్ ఇచ్చాడు.

తన భార్య వంశిక చద్దా ముందే కుల్దీప్ యాదవ్ ను బండ బూతులు తిట్టినట్లు తెలుస్తోంది. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా సరిగ్గా ఆడలేదని క్లాస్ పీకాడట గౌతమ్ గంభీర్. హోమ్ గ్రౌండ్ లు అయినప్పటికీ ఎందుకు వాడలేదని మండిపడ్డారట గౌతమ్ గంభీర్. ఇక ఇప్పుడు గ్రాండ్ గా పెళ్లి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నావ్..ఇంత‌ అవసరమా..? ఇది నీ పర్సనల్ అచీవ్మెంట్ మాత్రమే, టీమిండియాకు నువ్వేం చేసావ్ అని గౌతమ్ గంభీర్ తిట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక స్టేజ్ పైన కుల్దీప్ యాదవ్ తో ఎక్కడ కూడా గౌతమ్ గంభీర్ నవ్వుతూ కనిపించలేదు. సీరియస్ గానే వ్యవహరించారు. దీంతో నిజంగానే కుల్దీప్ యాదవ్ను స్టేజ్ పైన గౌతమ్ గంభీర్ తిట్టినట్లు చెబుతున్నారు.

Advertisement

Also Read: Taliban On PSL 2026: పాకిస్తాన్ స్టేడియాల్లో బాంబులు వేస్తాం…తాలిబ‌న్స్ హెచ్చ‌రిక‌లు, PSL 2026 ర‌ద్దు ?

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×