E-Paper
Advertisement

Ganguly vs virat Kohli : ఎవరిది తప్పు. గంగూలీదా, విరాట్ కొహ్లీదా.. సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ చర్చ

Ganguly vs virat Kohli  : ఎవరిది తప్పు. గంగూలీదా, విరాట్ కొహ్లీదా.. సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ చర్చ
Advertisement
Ganguly vs virat Kohli

Ganguly vs virat Kohli : బీసీసీఐ అధ్యక్షుడిగా తప్పుకున్న తరువాత గంగూలీ చాలా కామెంట్స్ ఫేస్ చేస్తున్నాడు. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు దాదా అంటే చాలా పవర్ ఫుల్. అతని మాటే చెల్లుబాటు. కాని, ఇప్పుడు పరిస్థితి అలా కనిపించడం లేదు. గంగూలీని తప్పు పట్టేవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. రవిశాస్త్రి అయితే.. ఇండైరెక్టుగానే కామెంట్ చేశాడు.

రవిశాస్త్రి కామెంట్స్ కంటే కూడా.. మొన్న విరాట్ కొహ్లీ, సౌరభ్ గంగూలీ మధ్య జరిగిన చిన్న ఇన్సిడెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ సమయంలో ఇద్దరూ ఎదురుపడినప్పటికీ.. కొహ్లీ మొహం తిప్పుకుని వెళ్లిపోయాడు. దీంతో అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చిన గంగూలీ… కొహ్లీకి ఇవ్వకుండానే వెళ్లిపోయాడు. అందరికీ తెలిసిందే.. టీమిండియా కెప్టెన్‌గా విరాట్‌ను తొలగించిందే గంగూలీ అని. బీసీసీఐ అధ్యక్షుడిగా ఈ పని చేయడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. విరాట్ కొహ్లీ కూడా. అందుకే, ఆ కోపంతోనే మొన్న గంగూలీ ఎదురుపడినప్పటికీ.. మొహం తిప్పుకుని వెళ్లిపోయాడు.

Advertisement

గంగూలీ పొజిషన్ చూసి ఎవరైనా గౌరవం ఇస్తారా అనే మీనింగ్ వచ్చేట్టుగా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ జట్టుకు హెడ్ కోచ్‌గా రిక్కీ పాంటింగ్‌ ఉన్నాడు. గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్‌ డైరెక్టర్‌గా ఉన్నాడు. పేరుకే డైరెక్టర్ తప్పితే.. గంగూలీకి ఎలాంటి పవర్స్ ఉండవరు అని రవిశాస్త్రి కామెంట్ చేశాడు. జట్టు మొత్తం హెడ్ కోచ్ చేతిలో ఉంటుందని, డెసిషన్స్ అన్నీ మేనేజ్ మెంట్ చూసుకుంటుందని, ఇక డైరెక్టర్ పదవి ఎందుకని మాట్లాడాడు. బహుశా.. డైరెక్టర్ పదవితో తన స్థాయి మరింత పెరిగింది గంగూలీ అనుకుంటున్నాడేమో అని వ్యాఖ్యానించాడు.

పోనీ గంగూలీకి పవర్స్ ఉన్నాయనుకున్నా.. ఆ జట్టు ఇప్పటి వరకు ఎందుకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదని ప్రశ్నించాడు. హెడ్ కోచ్‌గా పాంటింగ్, కెప్టెన్‌గా వార్నర్ ఉన్నప్పటికీ ఆ జట్టు ఇప్పటి వరకు బోణీ కొట్టకపోవడాన్ని గట్టిగానే క్వశ్చన్ చేశాడు రవిశాస్త్రి.

Advertisement

మొత్తానికి ఈ రెండు ఇన్సిడెంట్స్ చూసి.. గంగూలీనే తప్పు పడుతున్నారు ఫ్యాన్స్. రవిశాస్త్రి గంగూలీ గురించి చాలా చక్కగా మాట్లాడాడంటూ.. విరాట్ కొహ్లీని వెనకేసుకొస్తున్నారు. గంగూలీ కావాలనే విరాట్ కొహ్లీని కెప్టెన్సీ నుంచి తీసేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×