E-Paper
Advertisement

Lionel Messi: హైదరాబాద్ కు చేరుకున్న మెస్సీ, సీఎం రేవంత్ తో మ్యాచ్‌..షెడ్యూల్ ఇదే

Lionel Messi: హైదరాబాద్ కు చేరుకున్న మెస్సీ, సీఎం రేవంత్ తో మ్యాచ్‌..షెడ్యూల్ ఇదే
Advertisement

Lionel Messi:  ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ( Lionel Messi) హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపటికి తమే కోల్ క‌తా నుంచి హైదరాబాద్ చేరుకున్న లియోనెల్ మెస్సీ, శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. ఈ సందర్భంగా లియోనెల్ మెస్సీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అటు హైదరాబాద్ కు లియోనెల్ మెస్సీ వస్తున్న నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఆయన అభిమానుల సందడి నెలకొంది. వేలాది సంఖ్యలో శంషాబాద్ విమానాశ్రయానికి అభిమానులు చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

Also Read: T20 World Cup 2026: అదంతా ఫేక్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌సారాల‌పై ICC అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌, 2027 వ‌ర‌కు ఢోకా లేదు

30 నిమిషాలు ఆల‌స్యంగా హైద‌రాబాద్ కు మెస్సీ

Advertisement

హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ..ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. 30 నిమిషాలు ఆల‌స్యంగా హైద‌రాబాద్ కు మెస్సీ చేరుకున్నారు. ఇక శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా ఫలక్ నుమా బయలుదేరారు మెస్సీ. మెస్సీని కలిసేందుకు 250 మందికి అనుమతి మాత్రమే ఉండ‌నుంది. మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ ఫొటో సెషన్ ఉండ‌నుంది. మెస్సీని కలిసేవారికి క్యూఆర్ కోడ్ త‌ప్ప‌నిస‌రి చేశారు. ఫలక్ నుమా ప్యాలెస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అటు ఇప్ప‌టికే ఫలక్ నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ.

మెస్సీ రాక‌పై హైదరాబాద్ సిపి వీసీ సజ్జనార్ కీల‌క వ్యాఖ్య‌లు

ఇక మెస్సీ రాక‌పై హైదరాబాద్ సిపి వీసీ సజ్జనార్ ( Hyderabad CP VC Sajjanar ) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనాల్ మెస్సి కాసేప‌టి క్రిత‌ప‌మే హైదరాబాద్ కు వ‌చ్చార‌న్నారు. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి మెస్సీ ఫలక్ నుమా ప్యాలెస్ కు చేరుకుంటారన్నారు. ఆర్.జి ఎయిర్ పోర్టు నుంచి ఫలక్ నుమా ప్యాలెస్ వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామ‌ని వెల్ల‌డించారు వీసీ స‌జ్జ‌నార్‌. మెస్సితో పాటు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫలక్ నుమా ప్యాలెస్ లో కాసేపు గ‌డుపుతార‌న్నారు. ఇక మెస్సీ రాక నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామ‌న్నారు.

Advertisement

కొద్దిసేపటి క్రితమే డిజిపి కూడా ఫలక్ నుమా ప్యాలస్ కు చేరుకున్నారని వివ‌రించారు. కోల్ క‌తాలో జరిగినట్లుగా అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. రాచకొండ కమిషనర్ ఎప్పటికప్పుడు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నిటిని పర్యవేక్షిస్తున్నారన్నారు. సాయంత్రం 7.15 గంటల వరకు ఉప్ప‌ల్ స్టేడియానికి మెస్సి చేరుకుంటార‌ని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలతో పాటు మెస్సీ ఉప్పల్ కు బయలుదేరుతారని హైదరాబాద్ సిపి వీసీ సజ్జనార్ ప్ర‌క‌టించారు.

Also Read: Messi Meets Revanth: నేడే రేవంత్ రెడ్డి వ‌ర్సెస్‌ మెస్సీ మ్యాచ్‌…షెడ్యూల్ ఇదే,ఒక్క‌ ఫోటోకు రూ.10 లక్షలు

 

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×