E-Paper
Advertisement

Football Fans Angry: ఖతార్‌ నుంచి పరార్ అంటున్న ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్

Football Fans Angry: ఖతార్‌ నుంచి పరార్ అంటున్న ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్
Advertisement

ఆదివారం నుంచి ఖతార్‌లో ప్రారంభమయ్యే ఫిఫా వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు చూసేందుకు ఆ దేశానికి క్యూ కడుతున్నారు… ఫుట్‌బాల్‌ అభిమానులు. అయితే.. వాళ్లు అక్కడ ఎక్కువ రోజులు ఉండేలా కనిపించడం లేదు. ఇలా వచ్చిన వాళ్లు అలా అన్నీ సర్దుకుని… ఇక పరార్ అనేలా ఉంది… అక్కడి పరిస్థితి. నిబంధనల పేరుతో ఇప్పటికే మద్యంపై ఆంక్షలు విధించడంతో లబోదిబోమంటున్న ఫ్యాన్స్… అక్కడి ఆహార పదార్ధాల ధరలు చూసి షాకవుతున్నారు. పోనీలే కొని తిందామన్నా… పరమ నాసిరకంగా ఉండటంతో… తిట్టిపోస్తున్నారు.

ఖతార్‌లో ఫుడ్ రేట్లు చూస్తే… కడుపు మాడ్చుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోందని వివిధ దేశాల అభిమానులు సోషల్ మీడియాలో వాపోతున్నారు. మన దగ్గర గట్టిగా రూ.50 పెడితే దొరికే చిప్స్ లాంటి స్నాక్స్ కూడా… ఏకంగా రూ.500లకు అమ్ముతున్నారు. ఇక పిజ్జా ధర తక్కువలో తక్కువ అంటే రూ.800 ఉంది. ఇక సలాడ్స్ అయితే చెప్పనక్కర్లేదు. గ్రీక్ సలాడ్ అయితే రూ.900 పెట్టాల్సి వస్తోంది. అంత ధర పెట్టినా… ఫుడ్ క్వాలిటీ లేదని అభిమానులు ఆరోపిస్తున్నారు.

Advertisement

కొన్ని పదార్థాలు వందల్లో అమ్ముతుంటే… మరికొన్ని ఐటమ్స్ తినాలంటే వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇటాలియన్‌ ఐస్‌క్రీమ్‌ కాస్ట్ ఏకంగా రూ. 2,800. ఇక పోలిష్ కాఫీకి రూ. 3,300 వసూలు చేస్తున్నారు. వెజిటబుల్‌ చీజ్‌బర్గర్‌ కోసం రూ. 3,800 ఖర్చు చేయాల్సిందే. అర లీటర్ బీర్‌కు కూడా రూ. 1,100 గుంజుతున్నారు. చిన్న బర్గర్ కూడా రూ. 500 పెట్టి కొనాల్సి వస్తోంది. దాంతో… సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖతార్‌లో ఉండటం కంటే… పారిపోవడం బెటర్ అంటూ హోరెత్తిస్తున్నారు. అభిమానుల ఆవేదన చూశాకైనా… ధరలు తగ్గేలా ఖతార్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ ధరలు తగ్గించకపోతే మాత్రం… ఖతార్‌కు చెడ్డపేరు రావడం ఖాయం.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×