E-Paper
Advertisement

Naseem Shah: పాక్ క్రికెటర్ ఇంటిపై కాల్పులు..తుక్కు తుక్కైన కారు

Naseem Shah: పాక్ క్రికెటర్ ఇంటిపై కాల్పులు..తుక్కు తుక్కైన కారు
Advertisement

Naseem Shah:  పాకిస్తాన్ (Pakistan) పేరు వినగానే అందరికీ బాంబుల శబ్దాలు, టెర్రరిస్టుల దౌర్జన్యాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. దానికి తగ్గట్టుగానే నిత్యం పాకిస్తాన్ లో ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా పాకిస్తాన్ క్రికెటర్ ఇంటిపైనే (Pakistan Firing) కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ దేశంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ( Khyber Pakhtunkhwa ) ప్రాంతంలోని క్రికెటర్ నసీమ్ షా ( Naseem Shah) ఇంటిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ వీడియోలో కాల్పులు దారుణంగా జరిగినట్లే స్పష్టం అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Also Read: IPL 2026: SRH నుంచి ట్రావిస్ హెడ్ ఔట్‌…రంగంలోకి రోహిత్ శ‌ర్మ‌..కావ్య పాప ప్లాన్ అదుర్స్ ?

పాకిస్తాన్ క్రికెటర్ నసీమ్ షా ఇంటిపై కాల్పులు

Advertisement

పాకిస్తాన్ క్రికెటర్ నసీమ్ షా గురించి తెలియ‌ని వారుండ‌రు. ఈ మధ్యకాలంలో జట్టుకు దూరమైన నసీమ్ షా, మళ్లీ జట్టులో చేరేందుకు చాలా కష్టపడుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ( Khyber Pakhtunkhwa) ప్రాంతంలోని క్రికెటర్ నసీమ్ షా ఇంటిపై కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఎదురు కాల్పులు చేశారు. దుండగుల కాల్పులలో నసీమ్ షా ( Naseem Shah) ఇంటి మెయిన్ గేట్, కిటికీలు, ఇంటి ముందు పార్కు చేసిన కారు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటనలో ఎవరికి గాయాలు మాత్రం కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ సంఘ‌ట‌న‌పై జ‌రిగిన‌ప్పుడు నసీమ్ షా ఇంట్లో లేడ‌ని స‌మాచారం అందుతోంది. పాకిస్తాన్ క్రికెటర్ నసీమ్ షా ఇంటిపై కాల్పులు జ‌రిగిన త‌రుణంలో, అక్క‌డి పోలీసులు అల‌ర్ట్ అయ్యారు. నసీమ్ షా ఇంటి ద‌గ్గ‌ర ప్ర‌త్యేక సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం అందుతోంది. ఇక అటు ఈ సంఘ‌ట‌న నేప‌థ్యంలో ఐదుగురు అనుమానితులు కూడా అరెస్ట్ అయ్యారు.

పాకిస్తాన్ లో వ‌రుస‌గా దాడులు

పాకిస్తాన్ దేశంలో ( Paksitan ) వ‌రుస‌గా దారుణాలు జ‌రుగుతున్నాయి. ఉగ్ర‌వాదులు, స‌రైన పాల‌న లేక‌పోవ‌డంతో పాకిస్తాన్ లో క్రికెట్ ప్లేయ‌ర్ల‌కు కూడా భ‌ద్ర‌త లేకుండా పోయింది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇలాంటి సంఘ‌ట‌న‌లు పాకిస్తాన్ లో జ‌రుగుతాయ‌నే నేప‌థ్యంలోనే, టీమిండియా వాళ్ల దేశంలో ప‌ర్య‌టించ‌బోదు. మొన్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ  ( Champions Trophy 2025 ) స‌మ‌యంలో కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. బాంబు దాడులు ( Bomb Blast) జ‌రిగే ప‌రిస్థితులు ఉన్న నేప‌థ్యంలో పాకిస్తాన్ లో ప‌ర్య‌టించ‌లేదు టీమిండియా ( Team India). 2013 నుంచి పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ లు కూడా ర‌ద్దు అయ్యాయి.

Advertisement

Also Read: Virat Kohli Restaurant: గోవాపై క‌న్నేసిన విరాట్ కోహ్లీ..అదిరిపోయే హోట‌ల్ లాంచ్‌, ధ‌ర‌లు వాచిపోతాయి

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×