E-Paper
Advertisement

FIFA World Cup : ఘనా సంచలనం

FIFA World Cup : ఘనా సంచలనం
Advertisement

FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌లో మరో సంచలనం. గ్రూప్‌-Hలో… బలమైన, ర్యాంకింగ్స్‌లో తన కంటే ఎంతో మెరుగ్గా ఉన్న దక్షిణకొరియాకు షాకిచ్చింది… ఆఫ్రికా దేశం ఘనా. 3-2 గోల్స్ తేడాతో సౌత్‌ కొరియాను చిత్తు చేసి… నాకౌట్‌ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.

మ్యాచ్‌ మొదలైనప్పటి నుంచే దూకుడుగా ఆడిన ఘనా… 24వ నిమిషంలో తొలి గోల్ వేసింది. జోర్డాన్, ఆండ్రూ ఆయూ ద్వారా అందిన పాస్‌ను సలిసు గోల్‌గా మలచడంతో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది… ఘనా. ఆ తర్వాత మరో 10 నిమిషాలకే ఘనా ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. మళ్లీ జోర్డాన్, ఆండ్రూ ఆయూ అందించిన పాస్‌ను… ఈసారి మొహమ్మద్‌ కుడూస్‌ చక్కటి హెడర్‌తో బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపడంతో… దక్షిణ కొరియా షాకైంది. తొలి అర్ధభాగం ముగిసే సరికి ఆ జట్టు గోల్స్ ఏమీ చేయలేకపోవడంతో… ఘనా 2-0 ఆధిక్యంలో నిలిచింది.

Advertisement

సెకండ్‌ హాఫ్‌ ప్రారంభమయ్యాక… దక్షిణ కొరియా జూలు విదిల్చింది. ఆ జట్టు ఆటగాడు జో గూసంగ్ 3 నిమిషాల వ్యవధిలో రెండు హెడర్‌ గోల్స్ చేయడంతో… 2-2తో స్కోరు సమమైంది. 58వ నిమిషంలో లీ కాంగ్‌ ఇచ్చిన క్రాస్‌తో తొలి గోల్‌ చేసిన గూసంగ్, 61వ నిమిషంలో కిమ్‌ జిన్‌ కొట్టిన కిక్‌ను గోల్‌ పోస్ట్‌ ముందు అందుకుని… గాల్లోకి ఎగురుతూ అద్భుతంగా సెకండ్ గోల్‌ వేశాడు. దాంతో… మ్యాచ్ మళ్లీ దక్షిణ కొరియా చేతుల్లోకి వచ్చేసినట్టేనని ఆ దేశ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ… ఆ ఆనందం ఆరేడు నిమిషాలు కూడా నిలవలేదు. కొరియా ఢిఫెన్స్‌ను బోల్తా కొట్టిస్తూ… మొహమ్మద్ కుడూస్ రెండో గోల్‌తో ఘనాకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత దక్షిణకొరియా ఎన్ని ప్రయత్నాలు చేసినా మరో గోల్ కొట్టలేకపోయింది. ఘనా గోల్‌కీపర్‌ లారెన్స్‌ అతీ జిగీ మెరుపు వేగంతో కదులుతూ గోల్స్‌ను అడ్డుకోవడంతో దక్షిణకొరియా తీవ్ర నిరాశలో మునిగిపోయింది. నిర్ణీత సమయం పూర్తయ్యేసరికి 3-2 గోల్స్ తేడాతో ఘనా… ఘన విజయం సాధించి, నాకౌట్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×