E-Paper
Advertisement

Messi Meets Revanth: మెస్సీతో సీఎం రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు సర్వం సిద్ధం, 70 అడుగుల విగ్రహం

Messi Meets Revanth: మెస్సీతో సీఎం రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు సర్వం సిద్ధం, 70 అడుగుల విగ్రహం
Advertisement

Messi Meets Revanth: తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ మ‌రో మెగా ఈవెంట్ కు సిద్ధం అయింది. దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సితో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ కు సర్వం సిద్ధం అయిందని అధికారులు చెబుతున్నారు. హైద‌రాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఇందులో భాగంగానే, రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ కు చేరుకోనున్నారు అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సి.

Also Read: Ind vs SA 2nd T20I: 7 వైడ్లు వేసిన అర్ష‌దీప్‌,54 ప‌రుగులు..గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్‌, టీమిండియా టార్గెట్ ఎంతంటే

ఫలక్ నుమా ప్యాలెస్ లో మెస్సీ రాత్రి బస

Advertisement

దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సితో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ ఉన్న నేప‌థ్యంలో రేపు సాయంత్రానికి హైద‌రాబాద్ కు చేరుకోనున్నారు మెస్సీ. ఈ సంద‌ర్భంగా సాయంత్రం 7 గంట‌ల‌కు ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంటుంది. ఈ ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ అనంతరం ఫలక్ నుమా ప్యాలెస్ లో మెస్సీ రాత్రి బస చేస్తారు. ఎల్లుండి ఉదయం హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరనున్నారు అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సి. ఈ త‌రుణంలోనే, మెస్సీకి Z భద్రత, రూట్ మ్యాప్ కు ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.

రేవంత్ వ‌ర్సెస్ లియోనెల్ మెస్సి మ్యాచ్ ఎప్పుడంటే ?

లియోనెల్ మెస్సి మ్యాచ్ కు సర్వం సిద్ధం అయింది. ఉప్పల్ స్టేడియం లో రేపు మెస్సి ఫుట్ బాల్ మ్యాచ్ ఉంటుంది. ఇందులో భాగంగానే, ఈ నెల 13 న అంటే రేపు సాయంత్రం 4 గంటలకు మెస్సి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి లియోనెల్ మెస్సి ఫలక్ నమా ప్యాలెస్ కు చేరుకుంటారు. అక్కడి నుండి సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు. సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు ఉప్పల్ స్టేడియం లో మ్యాచ్ ఆడతారు. మ్యాచ్ లాస్ట్ లో 10 నిమిషాలు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం విజేతలకు లియోనెల్ మెస్సి, సీఎం రేవంత్ రెడ్డి బహుమతులు అందజేస్తారు. అనంతరం మెస్సి ఫలక్ నమా ప్యాలెస్ కి తిరిగి వెళ్తారు. రాత్రి ప్యాలెస్ లో బస చేస్తారు మెస్సి. ఉదయం హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరతారు లియోనెల్ మెస్సి. ఈ త‌రుణంలోనే లియోనెల్ మెస్సి కి Z క్యాటగిరి భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. అటు లియోనెల్ మెస్సి రూట్ మ్యాప్ ఇబ్బందుకు లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్ర పోలీసులు.

కోల్‌కతాలో 70 అడుగుల విగ్రహం

Advertisement

ఇండియాలో మెస్సీ ప‌ర్య‌టిస్తోన్న నేప‌థ్యంలో కోల్ క‌తాలో ఆయ‌న కోసం 70 అడుగుల విగ్ర‌హం ఏర్పాటు చేసారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ గా మారాయి.

Also Read: Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×