E-Paper
Advertisement

Emiliano Martínez : ఇండియాలో ల్యాండ్ అయిన వరల్డ్ కప్ విన్నర్.

Emiliano Martínez : ఇండియాలో ల్యాండ్ అయిన వరల్డ్ కప్ విన్నర్.
Advertisement
Emiliano Martínez

Emiliano Martínez : ఇండియాలో స్పోర్ట్స్, సినిమా.. ఈ రెండిటికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వీటిని ఎమోషన్‌గా భావిస్తుంటారు. అందుకే సినిమాల్లో నటించే వారికి, గ్రౌండ్‌లో స్పోర్ట్స్ ఆడేవారికి విపరీతమైన అభిమానులు ఉంటారు. మన దేశానికి చెందినవారా? పరాయి దేశానికి చెందినవారా? అన్న వ్యత్యాసం చూపించుకుండా అందరినీ సమానంగా ఇష్టపడుతుంటారు. తాజాగా వరల్డ్ ఛాంపియన్‌‌గా పేరు తెచ్చుకున్న ఎమిలియానో డిబూ మార్టినెజ్ ఇండియాకు రావడం తన ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది.

Advertisement

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ టీమ్‌కు చెందిన ఎమిలియానో డిబూ మార్టినెజ్.. తాజాగా రెండు రోజుల షెడ్యూల్‌తో ఇండియాలో అడుగుపెట్టాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టగానే మార్టినెజ్ ఫ్యాన్స్ అంతా తనను చూడడానికి ఎంతో ఆసక్తి చూపించారు. ఫిఫా వరల్డ్ కప్‌లో గోల్ కీపర్‌గా స్పోర్ట్స్ లవర్స్ అందరినీ విపరీతంగా ఇంప్రెస్ చేశాడు మార్టినెజ్. గతేడాది ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో తన పర్ఫార్మెన్స్ గురించి ఇప్పటికీ చాలామంది మాట్లాడుకుంటున్నారు.

‘నాకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇండియాకు రావడం కలలాగా ఉంది. నేను ఇండియాకు వస్తానని మాటిచ్చాను. ఇక్కడ ఉండడం సంతోషంగా ఉంది.’ అంటూ పోస్ట్ చేశాడు మార్టినెజ్. ఎయిర్‌పోర్టులో దిగగానే మీడియా, ఫ్యాన్స్ అంతా తన చుట్టుముట్టేశారు. ఇప్పటికే అర్జెంటీనాకు చెందినా పలువురు ఫుట్‌బాల్ ప్లేయర్స్ కోలకత్తాలో అడుగుపెట్టారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి మార్టినెజ్‌ కూడా జాయిన్ అయ్యాడు. అర్జెంటీనా, బ్రెజిల్‌కు చెందిన ఫుట్‌బాల్ ప్లేయర్స్‌కు ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుందని మార్టినెజ్ విజిట్‌తో మరోసారి ప్రూవ్ అయ్యింది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×