E-Paper
Advertisement

చిన్న‌స్వామిలో SRH అభిమానుల‌ 100 ఫోన్లు దొంగ‌త‌నం..RCB ఫ్యాన్స్‌పై కేసులు న‌మోదు !

చిన్న‌స్వామిలో SRH అభిమానుల‌ 100 ఫోన్లు దొంగ‌త‌నం..RCB ఫ్యాన్స్‌పై కేసులు న‌మోదు !
Advertisement

RCB v SRH:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసం ఉత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్ మార్చి 28వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ( RCB v SRH) మధ్య జరిగింది. చిన్న స్వామి స్టేడియం ( Chinnaswamy stadium) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించి, మొదటి విక్టరీ కొట్టింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అయితే ఈ మ్యాచ్ గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మ్యాచ్ సందర్భంగా డజన్ల కొద్ది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన అభిమానుల మొబైల్స్ దొంగతనానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత మంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జెర్సీలు ధరించిన వాళ్లపై కేసులు కూడా నమోదు అయినట్లు కథనాలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న బెంగుళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: PSL లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం..అర్ధ‌రాత్రి హోట‌ల్ గ‌దిలోకి 4 గురు దుండ‌గులు..షాహీన్‌, సికంద‌ర్ పై 2 ఏళ్ల బ్యాన్

చిన్న‌స్వామిలో SRH అభిమానుల‌ 100 ఫోన్లు దొంగ‌త‌నం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మార్చి 28వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా చిన్న స్వామి స్టేడియానికి వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఏదో మ్యాచ్ చూసి ఎంజాయ్ చేద్దామని అనుకున్న హైదరాబాద్ అభిమానులకు సంబంధించిన మొబైల్ ఫోన్లను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు దొంగతనం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 90 నుంచి 100 ఫోన్లు చిన్న స్వామి స్టేడియంలో దొంగిలించారని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. చిన్న స్వామి స్టేడియానికి సంబంధించిన P3 స్టాండ్ దగ్గర దాదాపు 60 ఫోన్లను ( Dozens of phone stolen) దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.

RCB ఫ్యాన్స్‌పై కేసులు న‌మోదు !

ఆ తర్వాత మ్యాచ్ పూర్తయిన తర్వాత బయటకు వెళ్లే క్రమంలో మరికొన్ని మొబైల్ ఫోన్స్ దొంగిలించారని సమాచారం. అయితే ఇందులో 30 మంది మాత్రమే బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వీళ్ళ ఫిర్యాదు ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన జెర్సీలు ధరించిన వాళ్ళు దొంగతనం చేసినట్లు చెబుతున్నారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు బెంగుళూరు పోలీసులు, ఆర్సీబీ అభిమానులపై కేసులు కూడా బుక్ చేశారు. దీనిపై విచారణ చేస్తున్నారు. ఈ చిన్న స్వామి స్టేడియం పరిధి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే కబ్బన్ పార్క్ పోలీసులే ఈ కేసును విచారిస్తున్నారు. మొబైల్స్ కోల్పోయిన వాళ్లు, ఎవ‌రైనా ఉంటే ఫిర్యాదు చేయాల‌ని కూడా ప్ర‌క‌ట‌న చేశారు.

Advertisement

Also Read: MI vs KKR Toss Fixing: వివాదంగా టాస్..తెర‌పైకి ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు, KKRపై ముంబై విజ‌యం

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×