E-Paper
Advertisement

FIFAs Income : ఫిఫా ఆదాయం ఎంతో తెలుసా?

FIFAs Income : ఫిఫా ఆదాయం ఎంతో తెలుసా?
Advertisement

FIFAs Income : ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దశాబ్దాల కిందటి నుంచే ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌లు అభిమానులకు ఫుల్లుగా కిక్కిస్తూ వస్తున్నాయి. ఆ కిక్కు… ఫుట్‌బాల్‌ వ్యవహారాలు చూసే ఫిఫాకూ ఆదాయం రూపంలో ఎక్కుతూ ఉంటుంది. నాలుగేళ్లకు ఓసారి జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌ ఆదాయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. 2018 వరల్డ్‌కప్‌లో ఫిఫాకు వచ్చిన ఆదాయం 460 కోట్ల డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.37,500 కోట్లు. ఆదివారం నుంచి జరగబోయే ఖతార్‌ వరల్డ్‌కప్‌లో అన్ని జట్లకూ ఇచ్చే మొత్తం ప్రైజ్ మనీ 44 కోట్ల డాలర్లు. అందులో విజేతకు 4.4 కోట్ల డాలర్లు… అంటే మన కరెన్సీలో దాదాపు రూ.358 కోట్లు దక్కుతుంది.

నాలుగేళ్లకు ఓసారి ఆదాయ వివరాలను వెల్లడిస్తుంది ఫిఫా. 2015-18 మధ్య ఫిఫా మొత్తం ఆదాయం 640 కోట్ల డాలర్లు… అంటే మన కరెన్సీలో దాదాపు రూ.52 వేల కోట్లు. ఇందులో ఎక్కువ ఆదాయం టీవీ ప్రసార హక్కుల అమ్మకం ద్వారానే వస్తుంది. వరల్డ్‌కప్‌, ఇతర ఇంటర్నేషనల్ టోర్నీల టీవీ ప్రసార హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతాయి. 2015-18 మధ్య ఫిఫా మొత్తం ఆదాయం 640 కోట్ల డాలర్లు అయితే… అందులో 460 కోట్ల డాలర్లు కేవలం టీవీ హక్కుల అమ్మకం ద్వారానే వచ్చాయి. ఇక మార్కెటింగ్‌ హక్కులు అమ్మడం ద్వారా కూడా ఫిఫాకు భారీగా ఆదాయం ఉంటుంది.

Advertisement

వరల్డ్‌కప్‌ లాంటి మెగా ఈవెంట్లలో బడా కంపెనీలు తమ ప్రకటనల కోసం ఫిఫాకు భారీగా సమర్పించుకుంటాయి. 2015-18 మధ్య మార్కెటింగ్‌ హక్కుల అమ్మకం ద్వారా ఫిఫాకు ఏకంగా 166 కోట్ల డాలర్లు… అంటే దాదాపు రూ.13,500 కోట్ల ఆదాయం వచ్చింది. టికెట్ల అమ్మకాలు, ఆతిథ్యం ద్వారా కూడా ఫిఫాకు ఆదాయం సమకూరుతుంది. టీవీ, మార్కెటింగ్‌ హక్కులతో పోలిస్తే అది చాలా తక్కువ. తన పేరు వాడుకోవడానికి కూడా ఫిఫా భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తుంది. వీడియో గేమ్స్‌ చేసే EA కంపెనీ… 20 ఏళ్ల పాటు ఫిఫా పేరు వాడుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుని… ఏడాదికి 15 కోట్ల డాలర్లు చెల్లిస్తోంది. నిరుడు లైసెన్సింగ్‌, మర్కండైజ్‌, రిటైల్‌, గేమింగ్‌ ద్వారా ఫిఫాకు 18 కోట్ల డాలర్లు వచ్చాయి. ఫిఫా ఆదాయం ముందు… అన్ని దేశాల క్రికెట్ బోర్డుల ఆదాయం దిగదుడుపే అంటే అతిశయోక్తి కాదు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×