E-Paper
Advertisement

Palash Muchhal: చేసిందంతా చేసి, ఇప్పుడు సింప‌తి కోసం ప‌లాష్ కొత్త డ్రామాలు… సుద్ద‌పూస‌లాగా మారీ!

Palash Muchhal: చేసిందంతా చేసి, ఇప్పుడు సింప‌తి కోసం ప‌లాష్ కొత్త డ్రామాలు… సుద్ద‌పూస‌లాగా మారీ!
Advertisement

Palash Muchhal: నవంబర్ 23న జరగాల్సిన భారత స్టార్ క్రికెటర్ స్మృతి మందాన, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. స్మృతి తండ్రి శ్రీనివాస్ కి హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో వివాహ వేడుక వాయిదా పడింది. దీంతో గత రెండు వారాలుగా సోషల్ మీడియాలో వీరి వివాహం గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వీరి వివాహానికి సంబంధించిన ఊహగానాలకు అడ్డు లేకుండా పోయింది.

Also Read: KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో 99% సక్సెస్ రేటు.. గిల్ దండగే, తొల‌గించాల‌ని డిమాండ్స్ !

Advertisement

పెళ్లి వాయిదా పడడంతో పలాశ్ ముచ్చల్ కొంతమంది మహిళలతో సంబంధం కలిగి ఉన్నాడని.. చాటింగ్ చేస్తున్నట్లు చూపించే అనేక స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. దీంతో నెటిజెన్లు ఇవే వివాహం ఆగిపోవడానికి కారణమని ఆరోపించారు. పలాశ్.. స్మృతిని చీట్ చేశాడనే విమర్శలు వచ్చాయి. కానీ ఇరు కుటుంబాలు ఈ ఆరోపణలకు సంబంధించి ఏ విషయాన్ని ధ్రువీకరించలేదు. ఇరు కుటుంబాలు కూడా ఆరోగ్య సమస్యలే పెళ్లి వాయిదాకు ప్రధాన కారణమని పేర్కొన్నాయి.

 

సింపతి కోసం పలాశ్ కొత్త డ్రామాలు..?:

Advertisement

సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్న వేల పలాశ్ ముచ్చల్ మరోసారి హాట్ టాపిక్ గా నిలిచాడు. అకస్మాత్తుగా ప్రేమానంద మహారాజ్ ఆశ్రమంలో దర్శనమిచ్చాడు పలాశ్. ఇటీవల తనపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, అతని వివాహం పై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈరోజు ప్రేమానంద మహారాజ్ ని సందర్శించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పలాశ్ అకస్మాత్తుగా ప్రేమనంద మహారాజ్ ఆశ్రమంలో దర్శనం ఇవ్వడంతో సమాజ సేవ, భక్తి కార్యక్రమాల ద్వారా తన ఇమేజ్ ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని కొంతమంది విమర్శకులు ఆరోపిస్తున్నారు. ప్రేమానంద ఆశ్రమంలో స్పెషల్ దర్శనం తీసుకోవడం కూడా ఇదే వ్యూహంలో భాగమని సోషల్ మీడియా వర్గాలలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల తన పేరు పలు విభాగాల్లో వినిపించడం, వాటిని దృష్టిలో పెట్టుకొని.. సానుభూతి పొందేందుకే ఇలా చేశాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే మరికొంతమంది మాత్రం అతడు వ్యక్తిగతంగా ఆధ్యాత్మికతను కోరుకొని అక్కడికి వెళ్లి ఉండొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: Chew Gum: క్రికెటర్లు ఎందుకు బబుల్ గం నములుతారు.. దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందా

 

పెళ్లికి సంబంధించిన కొత్త తేదీ గురించి అధికారిక ప్రకటన:

 

స్మృతి మందాన – పలాశ్ పెళ్లికి సంబంధించిన కొత్త తేదీపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. నవంబర్ 23న వీరి పెళ్లి వాయిదా పడగా.. డిసెంబర్ 7న కొత్త ముహూర్తం అని పేర్కొంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ గా మారాయి. అంతేకాకుండా డిసెంబర్ 7 తేదీతో ఉన్న ఓ వెడ్డింగ్ కార్డు కూడా నెట్టుంట వైరల్ అయింది. కానీ ఈ తేదీని పలాశ్ ముచ్చల్ కి సంబంధించిన వారు ఖండించారు. డిసెంబర్ 7న పెళ్లి గురించి మాకు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదని.. పెళ్లి ప్రస్తుతం వాయిదాలోనే ఉందని తెలిపారు. దీంతో డిసెంబర్ 7న పెళ్లి అనే వార్తలు ఫేక్ అని తెలుస్తోంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×