E-Paper
Advertisement

Dhoni – salman: ట్రాక్టర్ తో పొలం దున్నిన ధోని & సల్మాన్.. ఒళ్ళంతా బురదతో

Dhoni – salman: ట్రాక్టర్ తో పొలం దున్నిన ధోని & సల్మాన్.. ఒళ్ళంతా బురదతో
Advertisement

Dhoni – salman: భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ కూల్ గా ప్రసిద్ధి చెందిన టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి చాలా సంవత్సరాలు గడుస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటికీ ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ధోనీకి సంబంధించిన ఏ చిన్న ఫోటో వచ్చినా, వీడియో కనిపించినా అభిమానులు పండగ చేసుకుంటుంటారు.

Also Read: U19 Asia Cup 2025: వైభవ్ ను ర్యాగింగ్ చేసిన పాక్ ఫ్యాన్స్.. షాకింగ్ వీడియో వైరల్

Advertisement

ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్న ధోని.. 2026 ఐపీఎల్ సీజన్ కోసం కసరత్తులు చేస్తున్నాడు. కానీ ఈ ఐపీఎల్ సీజన్ కి చాలా సమయం ఉండడంతో తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి చెందిన మహారాష్ట్రలోని పన్వేల్ ఫామ్ హౌస్ లో మహేంద్ర సింగ్ ధోని, సింగర్ ఏపీ థిల్లాన్ తో సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

ఏమాత్రం సమయం దొరికినా సల్మాన్ ఖాన్ వ్యవసాయం చేస్తుంటాడు:

Advertisement

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తనకు ఏ మాత్రం సమయం దొరికినా తన ఫామ్ హౌస్ లో సందడి చేస్తుంటాడు. అలాగే వ్యవసాయం చేస్తుంటాడు. ఇతడికి పచ్చని పొలాల మధ్య గడుపుతూ ప్రకృతిని తనివితీర ఆస్వాదించడం అంటే ఎంతగానో ఇష్టం. ఇలా సల్మాన్ ఖాన్ వ్యవసాయం చేస్తున్న సమయంలో తీసిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే తన ఫామ్ హౌస్ కి ఇతర ప్రముఖులను కూడా అప్పుడప్పుడు ఇన్వైట్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా మహేంద్రసింగ్ ధోని, సింగర్ థిల్లాన్ ని కూడా ఇన్వైట్ చేశాడు. ఈ క్రమంలో ఈ ముగ్గురు కలిసి ఆ ఫామ్ హౌస్ లో చేసిన సందడికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

ఇంట్రెస్టింగ్ గేమ్:

క్రీడా – సినిమా రంగాలకు చెందిన మహేంద్ర సింగ్ ధోని, సల్మాన్ ఖాన్ మధ్య ఈ ఫామ్ హౌస్ లో ఓ ఇంట్రెస్టింగ్ గేమ్ సాగింది. ఈ గేమ్ కి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ ఫామ్ హౌస్ లో ఎత్తు పల్లాలుగా ఉన్న నేలను దుక్కి దున్నాలి. ఇందుకోసం ట్రాక్టర్ ని ఉపయోగించుకోవచ్చు. తడిగా ఉన్న నేలలో ట్రాక్టర్ తో దుక్కి దున్నే ఆటలో మహేంద్రసింగ్ ధోని రక్తి కట్టించాడు. అలా ఫామ్ హౌస్ లో సందడి చేసిన అనంతరం ట్రాక్టర్ వద్ద మహేంద్ర సింగ్ ధోని సల్మాన్ ఖాన్ అదిరిపోయే స్టిల్ తో ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలలో ఇద్దరు స్టార్స్ పూర్తిగా బురదతో తడిసిపోయారు.

Also Read: Shahid Afridi: ఇండియాను నిద్ర‌లేకుండా చేసారు.. మీరు రియ‌ల్ హీరోలు రా !

ఇందుకు సంబంధించిన ఫోటోలను బాలీవుడ్ నటుడు, దర్శకుడు అతుల్ అగ్నిహోత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. సల్మాన్ సోదరిని అతుల్ అగ్నిహోత్రి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలను అతడు అభిమానులకు షేర్ చేస్తుంటాడు. ఇక మహేంద్రసింగ్ ధోని ఇప్పటికే సినీ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక సినిమాని కూడా నిర్మించాడు. ఈ క్రమంలో త్వరలో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా ఏదైనా సినిమాని నిర్మిస్తాడా..? అందుకోసమే సల్మాన్ ని కలిశాడా.? అని చర్చించుకుంటున్నారు క్రీడా, సినీ ప్రేక్షకులు.

 

 

View this post on Instagram

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×