E-Paper
Advertisement

WPL : ఫైనల్ లో ఢిల్లీ.. ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై- యూపీ ఢీ..

WPL : ఫైనల్ లో ఢిల్లీ.. ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై- యూపీ ఢీ..
Advertisement

WPL : మహిళల ప్రీమియర్ లీగ్ లో లీగ్ మ్యాచ్ లు ముగిశాయి. 8 మ్యాచ్ ల్లో 6 ఆరేసి విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ (1.856), ముంబై ఇండియన్స్ ( 1.711) జట్లు సమానంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే నెట్ రన్ రెట్ లో మెరుగ్గా ఉన్న ఢిల్లీ ఫైనల్ కు చేరింది. నాలుగు విజయాలతో మూడోస్థానంలో ఉన్న యూపీ జట్టు ముంబైతో ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడుతుంది. ఈ మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది. ఈ పోరులో గెలిచిన జట్టు ఆదివారం ఫైనల్ లో ఢిల్లీని ఢీ కొడుతుంది.

ఢిల్లీ తన చివరి మ్యాచ్ లో యూపీ వారియర్స్ పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. తాహిలా మెక్ గ్రాత్ ( 32 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 58 నాటౌట్), కెప్టెన్ హీలీ ( 34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సుతో 36 రన్స్ ) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో ప్రత్యర్థి ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే యూపీ ఉంచగలిగింది. ఢిల్లీ బౌలర్లలో కాప్సీ 3 వికెట్లు పడగొట్టగా.. రాధా యాదవ్ 2, జొనెసన్ 1 వికెట్ తీశారు.

Advertisement

139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు కెప్టెన్ మెగ్ లానింగ్ ( 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 39 రన్స్ ), షఫాలీ వర్మ ( 16 బంతుల్లో 4 ఫోర్లతో 21 రన్స్ ) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 56 పరుగులు జోడించిన తర్వాత షఫాలీ అవుట్ అయ్యింది. స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (3) , కెప్టెన్ లానింగ్ వెంటవెంటనే అవుట్ కావడంతో ఢిల్లీ 70 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.

ఆల్ రౌండర్లు కాప్ ( 31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సుతో 34 నాటౌట్), కాప్సీ ( 31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సుతో 34 రన్స్ ) నాలుగో వికెట్ కు 60 పరుగులు జోడించారు. విజయానికి 9 పరుగులు దూరంలో ఉండగా కాప్సీ పెలిలియన్ కు చేరింది. ఆ వెంటనే జొనసెన్ ( 0) రనౌట్ అయినా..కాప్ జట్టును విజయతీరాలకు చేర్చింది. దీంతో ఢిల్లీ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. బౌలింగ్, బ్యాటింగ్ లో అదరగొట్టిన కాప్సీకి ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×