E-Paper
Advertisement

David Warner: మీరంతా స్కూల్ కు వెళ్లే పిల్ల బచ్చాలురా..మీడియా ముందే పాక్ క్రికెట‌ర్ల ప‌రువు తీసిన వార్న‌ర్

David Warner: మీరంతా స్కూల్ కు వెళ్లే పిల్ల బచ్చాలురా..మీడియా ముందే పాక్ క్రికెట‌ర్ల ప‌రువు తీసిన వార్న‌ర్
Advertisement

David Warner:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) రేపటి నుంచి ప్రారంభం కానుంది. మార్చి 26వ తేదీ అంటే మరో 12 గంటల్లో ప్రారంభం కాబోతున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. రేపు రాత్రి 8:30 గంటలకు మొట్ట మొదటి మ్యాచ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో పాల్గొనే 8 జట్ల కెప్టెన్లు ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెటర్లను ఉద్దేశించి ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ( David Warner) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెటర్లు అందరూ పిల్ల బచ్చాలు అంటూ బాంబు పేల్చాడు. దీంతో డేవిడ్ వార్నర్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Also Read: Shoaib Akhtar On PSL: అమ్మాయి-అబ్బాయి లేకుండా పెళ్లి చేస్తారా ? అభిమానుల‌ను నిషేధించ‌డంపై షోయ‌బ్ అక్త‌ర్ సీరియ‌స్

పాకిస్తాన్ క్రికెటర్లు అందరూ పిల్ల బచ్చాలే

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament ) రేపు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కెప్టెన్స్ అందరూ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ మాట్లాడేటప్పుడు అతన్ని షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi ), మహమ్మద్ రిజ్వాన్ ( Muhammad Rizwan) లాంటి పాకిస్తాన్ క్రికెటర్లు గెలిచారు. డేవిడ్ వార్నర్ ను డిస్టర్బ్ చేసేలా గుస గుసలు పెట్టారు. అయితే, ఈ నేపథ్యంలోనే చిర్రెత్తిపోయిన డేవిడ్ వార్నర్.. పాకిస్తాన్ క్రికెటర్ల పరువు తీశాడు. పాకిస్తాన్ మీడియా సమక్షంలోనే షాహీన్ అఫ్రిది అలాగే మహమ్మద్ రిజ్వాన్ లాంటి క్రికెటర్ల పరువు తీశాడు. వీళ్లంతా స్కూల్ కు వెళ్లే పిల్ల బచ్చాలు అంటూ మండిపడ్డాడు.

నేను మాట్లాడేటప్పుడు చిన్న పిల్లల లాగా గుసగుసలు పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. అయితే, ఇది చూసిన నెటిజెన్స్ ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. నిజంగానే పాక్ క్రికెట‌ర్ల‌కు బుద్ధి లేద‌ని మండిప‌డ్డారు. ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ( David Warner) మాట్లాడుతుంటే, ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం దారుణం అంటూ ఆగ్ర‌హించారు. ఐపీఎల్ వ‌దిలేసిన త‌ర్వాత డేవిడ్ వార్న‌ర్ ప‌రువు రోజు రోజుకు దిగ‌జారుతోంద‌ని, ఇప్పుడు పాకిస్తాన్ అలాంటి అవ‌మాన‌మే ఎదురైంద‌ని మ‌రి కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ వెధ‌వ‌ల ముందు కూడా డేవిడ్ వార్న‌ర్ చుల‌క‌న అయ్యాడ‌ని అంటున్నారు.

కరాచీ కింగ్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో కరాచీ కింగ్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గతంలో ఆరు జట్లు మాత్రమే ఉండేవి. ఈసారి కొత్తగా రెండు జట్లు యాడ్ అయ్యాయి. దీంతో ఈ టోర్నమెంట్ పై ఆసక్తి నెలకొంది. కాగా చమురు అలాగే యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అభిమానులు లేకుండానే టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.

Also Read: Suryakumar-chewing gums: ఒక్క రోజుకు 500 చూయింగ్ గ‌మ్స్..సూర్య కుమార్ కోసం బీసీసీఐ ఎన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తోందంటే ?

 

https://www.instagram.com/reels/DWTywNVCZUo/

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×