E-Paper
Advertisement

MS Dhoni-Chandrababu: ఏపీలో ధోని ప‌ర్య‌ట‌న‌..చంద్ర‌బాబుతో స‌మావేశం..అస‌లు కార‌ణం ఇదే !

MS Dhoni-Chandrababu: ఏపీలో ధోని ప‌ర్య‌ట‌న‌..చంద్ర‌బాబుతో స‌మావేశం..అస‌లు కార‌ణం ఇదే !
Advertisement

MS Dhoni-Chandrababu:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ( Ms Dhoni) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh) రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కూడా సమావేశం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు మహేంద్ర సింగ్ ధోని ఏపీ పర్యటన ఖరారు అయింది. జనవరి 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పర్యటిస్తారని తెలుస్తోంది. దాదాపు రెండు రోజులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోనే మహేంద్ర సింగ్ ధోని గడుపుతారని కూడా సమాచారం అందుతోంది.

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

అమరావతిలో మహేంద్రసింగ్ ధోని పర్యటన

Advertisement

ఏపీ పర్యటనలో భాగంగా మహేంద్ర సింగ్ ధోని అమరావతిలో కూడా పలు ప్రాంతాలను సందర్శిస్తారట. జనవరి 9వ తేదీన మధ్యాహ్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ( Cm Chandrababu naidu) కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారని లీకులు బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చ జరగనుందట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధిపై మహేందర్ సింగ్ ధోనితో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చిస్తారని తెలుస్తోంది. ఏపీలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసే విషయం పైన ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య చర్చ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా మహేంద్రసింగ్ ధోని

ఇక ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా మహేంద్రసింగ్ ధోని నియామకం చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఏపీలోని చేనేత రంగాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా బ్రాండ్ అంబాసిడర్ గా ధోనిని నియామకం చేయాలని.. ఈ మేరకు అతని అనుమతి తీసుకోవాలని చంద్రబాబు సర్కార్ ఆలోచన చేస్తుంది అంట. జనవరి 9వ తేదీన జరిగే సమావేశంలో ధోనితో ఇదే అంశంపై చంద్రబాబు నాయుడు చర్చిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం అమరావతిలోని పలు పర్యాటక క్షేత్రాల్లో కూడా మహేంద్రసింగ్ ధోని పర్యటన ఉంటుందట. ఇలా రెండు రోజులపాటు ఏపీలోనే ధోని ఉంటాడని చెబుతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఏపీ ప్రభుత్వం రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అటు మహేంద్రసింగ్ ధోని ఏపీ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించబోతున్న మహేంద్రసింగ్ ధోని… త్వరలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో కూడా ఆడ బోతున్నాడు. గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోని.. ఈసారి ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగనున్నాడు.

Advertisement

Also Read:  BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×