E-Paper
Advertisement

CM Revanth vs Lionel Messi: మెస్సీ కిక్ అదుర్స్‌..స్టేడియం రూఫ్ పైన ప‌డిన బంతి.. రాహుల్‌, రేవంత్ కు గిఫ్ట్

CM Revanth vs Lionel Messi: మెస్సీ కిక్ అదుర్స్‌..స్టేడియం రూఫ్ పైన ప‌డిన బంతి.. రాహుల్‌, రేవంత్ కు గిఫ్ట్
Advertisement

CM Revanth vs Lionel Messi:   అర్జెంటీనా దేశానికి చెందిన దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయ‌ర్ లియోనెల్ మెస్సీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నారు లియోనెల్ మెస్సీ. ఇవాళ ఉదయం రెండున్నర గంటల ప్రాంతంలో ఇండియాలో అడుగుపెట్టిన లియోనెల్ మెస్సీ, కోల్ క‌తా నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి సందడి చేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో శనివారం ఫ్రెండ్లీ మ్యాచ్ లో పాల్గొన్నారు. ఈ మ్యాచ్ లో లియోనెల్ మెస్సీ వ‌ర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth vs Lionel Messi ) జ‌ట్ల మధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ తరుణంలోనే లియోనెల్ మెస్సీ పై సింగరేణి ఆర్ఆర్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ లో దాదాపు పది నిమిషాలు పాల్గొన్న లియోనెల్ మెస్సీ, కొన్ని బంతులను ప్రేక్షకుల గ్యాలరీలోకి పంపించాడు. అయితే ఓ బంతి గట్టిగా కిక్కిస్తే, ఉప్ప‌ల్ స్టేడియం ( Uppal Stadium) రూఫ్ పైన పడింది. దీంతో అక్కడ ఉన్న ఫ్యాన్స్, కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. ఆ బంతి స్టేడియం రూఫ్‌ పైన పడటంతో ఫ్యాన్స్ అరుపులకు ఉప్పల్ మైదానం మొత్తం దద్దరిల్లిపోయింది.

Also Read: Messi Meets Revanth: నేడే రేవంత్ రెడ్డి వ‌ర్సెస్‌ మెస్సీ మ్యాచ్‌…షెడ్యూల్ ఇదే,ఒక్క‌ ఫోటోకు రూ.10 లక్షలు

Advertisement

సీఎం రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి స్పెష‌ల్ గిఫ్ట్‌

ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లియోనెల్ మెస్సీ ( CM Revanth vs Lionel Messi ) మ్యాచ్ పూర్త‌యిన త‌ర్వాత అరుదైన సంఘ‌ట చోటు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లియోనెల్ మెస్సీ స్టేడియంలో క‌లియ తిరుగుతూ, ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. అనంత‌రం ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన ఇరు జట్లకు ట్రోఫీని మెస్సీ, సీఎం రేవంత్, రాహుల్ గాంధీ ముగ్గురు క‌లిసి అందించారు. ఆ త‌ర్వాత‌ సీఎం రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి జెర్సీ నం.10ని బహుకరించారు మెస్సీ. ఈ సంఘ‌ట‌న కూడా వైర‌ల్ గా మారింది.

Advertisement

ఓవ‌రాల్ గా ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లియోనెల్ మెస్సీ మ్యాచ్ గ్రాండ్ స‌క్సెస్ అయింద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. ప‌శ్చిమ‌ బెంగాల్ లో ఫ్లాప్.. హైదరాబాద్ లో హిట్ అని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మనమేంటో చూపించామని ఫ్యాన్స్ కూడా చెబుతున్నారు. మెస్సీని దగ్గరగా చూడటంతో తమ డ్రీమ్ నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు అభిమానులు. ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లియోనెల్ మెస్సీ మ్యాచ్ పూర్తయిన త‌ర్వాత మ‌రో సంఘ‌ట‌న కూడా జ‌రిగింది. మెస్సీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మనవడు రుద్ర దేవ్ రెడ్డి కూడా ఫుట్‌బాల్ ఆడాడు.

 

Also Read: T20 World Cup 2026: అదంతా ఫేక్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌సారాల‌పై ICC అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌, 2027 వ‌ర‌కు ఢోకా లేదు

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×