E-Paper
Advertisement

Babar Azam-BBL: బంతుల‌న్ని మింగుతాడు, బ్యాటింగ్ చేయ‌రాదు..బాబ‌ర్ ఆజం ప‌రువు తీసిన బౌల‌ర్

Babar Azam-BBL:  బంతుల‌న్ని మింగుతాడు, బ్యాటింగ్ చేయ‌రాదు..బాబ‌ర్ ఆజం ప‌రువు తీసిన బౌల‌ర్
Advertisement

Babar Azam-BBL: బిగ్ బాస్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Big Bash League 2025-26 ) భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ( Babar Azam ) పరువు రోజురోజుకు దిగజారుతోంది. నిన్న బాబర్ ఆజంకు స్టీవెన్ స్మిత్ స్ట్రైక్ ఇవ్వలేదన్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన నిన్నటి నుంచి వైరల్ గా మారింది. ఇలాంటి నేపథ్యంలో బాబర్ ఆజం పరువు తీసేలా మరో ప్లేయర్ మాట్లాడారు. ఎక్కువసేపు బాబర్ ఆజం బ్యాటింగ్ చేస్తే, తమ జట్టుకు చాలా ప్లస్ అవుతుందని సిడ్నీ థండర్స్ జట్టుకు చెందిన ఆటగాడు క్రిస్ గ్రీన్ ( CHRIS GREEN ) పేర్కొన్నారు. బాబ‌ర్ ఆజం కు పెద్దగా బ్యాటింగ్ చేయడం చేతకాదని పరోక్షంగా చెప్పి.. అతని పరువు తీశాడు.

Also Read: Babar Azam-Steve Smith: బాబర్ ఆజాంకు స్ట్రైక్ ఇవ్వకుండా పరువు తీసిన స్మిత్..బ్యాట్ నెల‌కొట్టి రెచ్చిపోయిన పాక్ బ్యాట‌ర్‌

బాబర్ పరువు తీసిన క్రిస్ గ్రీన్

Advertisement

బిగ్ బాస్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Big Bash League 2025-26 ) భాగంగా నిన్న సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ సిడ్నీ థండర్స్ ( Sydney Sixers vs Sydney Thunder, 37th Match ) మధ్య 37వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సిడ్నీ సిక్సర్స్ ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్, సిడ్రీ సిక్సర్ ఆటగాడు బాబ‌ర్ ఆజం పరువు తీశాడు సిడ్నీ థండర్ బౌలర్ క్రిస్ గ్రీన్. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన క్రిస్ గ్రీన్, 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీశాడు.

ఈ నేపథ్యంలోనే బాబ‌ర్ ఆజం పరువు తీశాడు. బాబ‌ర్ ఆజం ఎక్కువసేపు గ్రీసులో ఉండి బ్యాటింగ్ చేస్తే తమ జట్టుకు ప్లస్ అవుతుందని వెల్లడించాడు గ్రీన్. ఎందుకంటే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ( Babar Azam ) కు పెద్దగా బ్యాటింగ్ చేతకాదు.. దానివల్ల మేము ఎలాంటి బంతులు వేసిన ప్రత్యర్థి జట్టుకు పరుగులు ఎక్కువగా పోవు… బాబ‌ర్ ఆజం ఎక్కువ సేపు డిఫెన్స్ ఆడతాడు. బాల్స్ అన్ని మింగుతాడు. తక్కువ పరుగులు రాబడతాడని ఇజ్జత్ తీశాడు క్రిస్ గ్రీన్. దీంతో తమ జట్టుకు చాలా ప్లస్ అవుతుందని వెల్లడించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

బాబ‌ర్ ఆజంకు స్ట్రైక్ ఇవ్వని స్టీవెన్ స్మిత్

Advertisement

సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ సిడ్నీ థండర్స్ ( Sydney Sixers vs Sydney Thunder, 37th Match ) మధ్య జ‌రిగిన‌ 37వ మ్యాచ్ లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం కు స్ట్రైక్ ఇవ్వలేదు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవెన్ స్మిత్. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు సిడ్నీ సిక్సర్స్ జట్టు తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న ఇద్దరూ ఓపెనర్లుగా దిగి బ్యాటింగ్ చేశారు. అయితే బాబర్ ఆజం 47 పరుగుల వద్ద ఉండగా సింగిల్ కోసం ప్రయత్నించాడు.

కానీ సింగిల్ తీసేందుకు స్టీవెన్ స్మిత్ మాత్రం నిరాకరించాడు. నీకు బ్యాటింగ్ చేతకావడం లేదు… సింగిల్ తీస్తే నీకు స్ట్రైక్ వస్తుంది… అందుకే వద్దు అని చెప్పేశాడు. దీంతో స్ట్రైక్ తీసుకున్న స్టీవెన్ స్మిత్ ఓకే ఓవర్ లో 32 పరుగులు సాధించాడు. అటు 47 పరుగుల వద్ద బాబర్ అవుట్ అయ్యాడు. దీంతో స్టీవెన్ స్మిత్ ను ఉద్దేశించి కోపంతో రగిలిపోయిన బాబర్, నేలకు బ్యాట్ ను కొట్టేశాడు. ఈ సంఘ‌ట‌న కూడా వైర‌ల్ గా మారింది.

Also Read: Rohit-Gambhir: రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయేలా చేసింది గంభీరే..వాడు పెద్ద‌ దుర్మార్గుడు..మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×