E-Paper
Advertisement

మారథాన్ మ‌ధ్య‌లోనే పీరియ‌డ్స్, లేడీ అథ్లెట్ కు తీవ్ర ర‌క్త‌స్రావం

మారథాన్ మ‌ధ్య‌లోనే పీరియ‌డ్స్, లేడీ అథ్లెట్ కు తీవ్ర ర‌క్త‌స్రావం
Advertisement

Chinese Marathon – Period :  చైనా దేశానికి సంబంధించిన 25 ఏళ్ల అథ్లెట్ లీ మీజెన్ (Chinese athlete Li Meizhen).. మారథాన్ లో (marathon) పాల్గొనగా… మధ్యలోనే ఆమెకు పీరియడ్స్ ( period) వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. ఈ నెలసరి వచ్చిన నేపథ్యంలో.. తీవ్ర రక్త స్రావం కూడా జరిగినట్లు పోస్టులు వైరల్ చేస్తున్నారు. అంతేకాదు వేగంగా పరిగెత్తిన నేపథ్యంలో 25 ఏళ్ల అథ్లెట్ లీ మీజెన్ మరణించింది అని కూడా విష ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. మారథాన్ లో పీరియడ్స్ వచ్చి ఓ అథ్లెట్ మరణించిందా ? ఇది అత్యంత విషాదకరమైన సంఘటన అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

మారథాన్ మ‌ధ్య‌లోనే పీరియ‌డ్స్, లేడీ అథ్లెట్ కు తీవ్ర ర‌క్త‌స్రావం

Advertisement

చైనాకు సంబంధించిన 25 ఏళ్ల మహిళ అథ్లెట్ లీ మీజెన్ మారథాన్ లో (Chinese athlete Li Meizhen) మృతి చెందినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మారథాన్ మధ్యలో ఆమెకు పీరియడ్స్ వచ్చింది వాస్తవమే. కానీ ఆమె రక్తస్రావం జరిగినప్పటికీ మారథార్ పూర్తి చేసి.. ఆస్పత్రి పాలయ్యారు. అనంతరం కోలుకున్నారు. కానీ ఆమె మరణించినట్లు తప్పుడుగా పోస్టులు పెడుతున్నారు. ఈ మధ్య ఈ సంఘటన జరిగినట్లు పోస్టులు కూడా వైరల్ చేస్తున్నారు. వాస్తవంగా ఈ సంఘటన 2024 సెప్టెంబర్ మాసంలో జరిగింది. చైనాలోని హేబి ఫ్రావిన్స్ లో ఈ మారథాన్ జరిగింది. అయితే ఈ మారథాన్ మధ్యలో 34 కిలో మీటర్ వద్దకు చేరుకున్న తర్వాత ఆమెకు ఆకస్మికంగా పీరియడ్స్ ప్రారంభమయ్యాయి.

తీవ్రమైన కడుపునొప్పి.. తీవ్రమైన రక్తస్రావం జరిగినప్పటికీ.. ఆమె వెనుకడుగు వేయలేదు. రెండు గంటల 35 నిమిషాల 7 సెకండ్లలో టార్గెట్ ఫినిష్ చేసుకొని 16వ స్థానంలో నిలిచారు. ఆ త‌ర్వాత ఆస్ప‌త్రికి వెళ్లి, చికిత్స పొందారు. ఈ విష‌యం తెలియ‌కుండా, పీరియ‌డ్స్ తో మ‌ర‌ణించిన‌ట్లు పోస్టులు ఇప్పుడు పెడుతున్నారు. అయితే నెలసరి జరిగినప్పటికీ కూడా.. మారథాన్ ఫినిష్ చేసిన 25 ఏళ్ల అథ్లెట్ లీ మీజెన్ (Chinese athlete Li Meizhen) పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మహిళ అయినప్పటికీ దృఢంగా నిలబడి… పరుగు పందెం ఫినిష్ చేయడం చాలా గ్రేట్ అంటున్నారు.

అసలు మారథాన్ అంటే ఏంటి ?

Advertisement

మారథాన్ అనేది 42.195 కిలో మీటర్ల పాటు సాగే సుదీర్ఘమైన పరుగు పందెం. అంటే దాదాపు 26.2 మైళ్ళు అన్న మాట. ఇది ప్రాచీన గ్రీకు వీరుడి జ్ఞాపకార్థం ప్రారంభమైంది. అంతర్జాతీయంగా ఈ క్రీడాను అన్ని దేశాలు నిర్వహిస్తున్నాయి. మన హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలలో పెద్ద ఎత్తున మారథాన్ పోటీలు నిర్వహించారు. దీనివల్ల శరీర దారుఢ్యాన్ని పెంచుకోవచ్చు. గుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.

Also Read: 6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×