E-Paper
Advertisement

CSK vs LSG: లక్నోను చిత్తు చేసిన చెన్నై.. 12 పరుగుల తేడాతో విజయం..

CSK vs LSG: లక్నోను చిత్తు చేసిన చెన్నై.. 12 పరుగుల తేడాతో విజయం..
Advertisement

CSK vs LSG: ఐపీఎల్-16వ సీజన్ లో భాగంగా సోమవారం జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. సీజన్ ఆరంభంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన చెన్నై.. సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో విశ్వరూపం కనబర్చింది. 12 పరుగుల తేడాతో లక్నోపై విజయం సాధించింది.

ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 31 బంతుల్లో 57 పరుగులు, కాన్వే 29 బంతుల్లో 47 పరుగులతో రాణించారు. చివరి ఓవర్‌లో క్రీజులోకి అడుగుపెట్టిన కెప్టెన్‌ కూల్‌ మహేంద్రసింగ్‌ ధోనీ.. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను భారీ సిక్సర్లుగా మలిచి మైదానాన్ని ఉర్రూతలూగించాడు. ఆదే సమయంలో లక్నో బౌలర్లు మార్క్ వుడ్, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీశారు.

Advertisement

ఆ తర్వాత లక్ష్యఛేదనలో లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ కైల్ మయేర్స్ 22 బంతుల్లో 53 పరుగులతో రాణించాడు. చెన్నై బౌలర్ మోయిన్ అలీ 4 వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అలీ దక్కించుకున్నాడు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×