E-Paper
Advertisement

Boxing Day Test : నేడే సఫారీలతో టెస్ట్ సవాల్.. వరుణుడు కరుణించేనా..?

Boxing Day Test : నేడే సఫారీలతో టెస్ట్ సవాల్.. వరుణుడు కరుణించేనా..?
Advertisement

Boxing Day Test : టి20 సిరీస్‌ 1-1 డ్రాగా ముగిసిన తరువాత, కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో మెన్ ఇన్ బ్లూ, వన్డేల్లో దక్షిణాఫ్రికాపై 2-1 సిరీస్ విజయాన్ని సాధించింది. కేఎల్ రాహుల్ దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ విజయం సాధించిన రెండవ భారత కెప్టెన్ అయ్యాడు.దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు ఇప్పుడు ప్రొటీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు సిద్ధమైంది.ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం సాధించాలని రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ తహతహలాడుతున్నారు. నేడు సెంచూరియన్‌లో ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్ట్‌కి సర్వం సిద్ధమైంది.

తొలి రెండు రోజులు వర్షం పడే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ చేసే అవకాశం ఉంది. గాయంతో షమీ దూరమవటం టీమిండియాకు పెద్ద లోటు అని చెప్పొచ్చు. షమీ స్ధానంలో ప్రసిధ్ధ్ అరంగ్రేటం చేసే అవకాశాలున్నాయి. ఓవర్ కాస్ట్ కండీషన్స్ ఉండటంతో అశ్విన్ ప్లేస్‌లో శార్ధూల్ ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఆడనున్నట్లు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు.

Advertisement

దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు భారత్ 23 టెస్టులు ఆడగా నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. 12 టెస్టుల్లో ఆతిథ్య జట్టు విజయం సాధించింది. 7 టెస్టులు డ్రాగా ముగిసాయి. దక్షిణాఫ్రికాకు స్వర్గధామమైన సెంచూరియన్‌లో.. ఆతిథ్య జట్టు ఇప్పటివరకు 28 టెస్టులు ఆడగా 22 మ్యాచుల్లో గెలిచి.. మూడింట్లో మాత్రమే ఓడింది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×