E-Paper
Advertisement

Virender Sehwag: నేనైతే పాకిస్తాన్ బౌల‌ర్ల కెరీర్ నాశ‌నం చేసేవాడిని..300 స్ట్రైక్ రేట్ తో న‌ర‌కం చూపిస్తా

Virender Sehwag: నేనైతే పాకిస్తాన్ బౌల‌ర్ల కెరీర్ నాశ‌నం చేసేవాడిని..300 స్ట్రైక్ రేట్ తో న‌ర‌కం చూపిస్తా
Advertisement

Virender Sehwag:  టీమిండియా ఒకప్పటి డేంజర్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ డేంజర్ ఆటగాడు గ్రౌండ్ లో అడుగు పెట్టాడంటే చాలు… ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. వీరేంద్ర సెహ్వాగ్ కు బౌలింగ్ చేయాలన్నా కూడా గజగజ వణికి పోయేవారు బౌలర్లు. చాలామంది బౌలర్ల అడ్రస్ లేకుండా చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. అయితే అలాంటి డేంజర్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పాకిస్తాన్ బౌలర్లు ( Pakistan bowling attack) తనకు బౌలింగ్ చేసి ఉంటేనా.. 300 స్ట్రైక్ రేట్ తో రెచ్చిపోయేవాడిని వార్నింగ్ ఇచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్. కలలో కూడా గుర్తుకు వచ్చేలా చుక్కలు చూపించే వాడినని షాకింగ్ కామెంట్స్ చేశారు. చిత‌క‌బాది పాకిస్తాన్ బౌల‌ర్ల కెరీర్ నాశ‌నం చేసేవాడిని అంటూ హెచ్చ‌రించాడు.

Also Read: Trolls On Shubman Gill: ఓరి ద‌రిద్రుడా..రోహిత్ శ‌ర్మ సాధించిన ఛాంపియన్స్ ట్రోఫీని ఖాతాలో వేసుకున్నావా ? గిల్ పై దారుణంగా ట్రోల్స్‌

పాకిస్తాన్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌.. దారుణంగా ట్రోలింగ్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో పాకిస్తాన్ ( Pakistan Team) అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. సూపర్ 8 దశ వరకు వచ్చిన పాకిస్తాన్ ఆ తర్వాత ఎలిమినేట్ అయింది. ఇక లేటెస్ట్ గా, బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ కూడా కోల్పోయింది పాకిస్తాన్ జట్టు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఈ దారుణమైన ఓటమిని చవిచూసింది. దీంతో పాకిస్తాన్ జట్టులో ప్రక్షాళన చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. చెత్త బౌలింగ్ కారణంగానే పాకిస్తాన్ ఓడిపోతుందని విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా దీనిపై విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ నుంచి మొదలు పెడితే ప్లేయర్ల వరకు అందరూ విఫలమవుతున్నారని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. మొత్తం ప్రక్షాళన చేయడంతో పాటు కుర్ర క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని చెబుతున్నారు.

నేనైతే పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు నిద్ర లేకుండా చేసేవాడిని

పాకిస్తాన్ వైఫల్యాలను టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్  ఎత్తి చూపారు. పాకిస్తాన్ పరువు తీస్తూ ర్యాగింగ్ చేశారు వీరేంద్ర సెహ్వాగ్. తాను ఇప్పటికి క్రికెట్ ఆడి ఉంటే… పాకిస్తాన్ ప్రీమియం బౌలర్లను ఉతికి ఆరేసే వాడిని అంటూ హెచ్చరించారు. షాహిద్ ఆఫ్రిది, నసీమ్ షా, హ‌రీస్ రౌఫ్ లాంటి బౌలర్లను చీల్చి చెండాడే వాడిని అంటూ తెలిపారు. వీళ్ళ బౌలింగ్ లో 300 స్ట్రైక్ రేటుతో ఇరగదీసే వాడిన‌ని శపథం చేశారు వీరేంద్ర సెహ్వాగ్. త‌న ప్ర‌తాపానికి పాక్ బౌల‌ర్లకు నిద్ర‌కూడా ప‌ట్ట‌బోద‌ని హెచ్చ‌రించారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. కాగా, వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌క ముందు, పాకిస్తాన్ జ‌ట్టుపై ఓ రేంజ్ లో బ్యాటింగ్ చేశాడు.

Advertisement

Also Read: Pakistan PM: గాజులు వేసుకోని ఇంట్లో కూర్చోండి.. బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మిపై పాక్ ప్ర‌ధాని సీరియ‌స్ !

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×