// // Hasan Nawaz on Indian Bowlers: టీమిండియా అంటేనే చిరాకు - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

టీమిండియా బౌలర్లు అంటేనే చిరాకు, అస‌హ్యం..వ‌రుస‌గా సిక్సులు కొట్టి వాళ్ల తాట తీస్తా !

టీమిండియా బౌలర్లు అంటేనే చిరాకు, అస‌హ్యం..వ‌రుస‌గా సిక్సులు కొట్టి వాళ్ల తాట తీస్తా !
Advertisement

Hasan Nawaz on Indian Bowlers:  ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నాయి. పహల్గామ్ సంఘటన తర్వాత పాకిస్తాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడం లేదు మన ఇండియన్స్. ఆసియా కప్ నుంచి ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ ప్లేయర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పాకిస్తాన్ క్రికెటర్లు. నిత్యం ఏదో ఒక అంశంపై ఇండియాపై విషం కక్కుతూనే ఉన్నారు. అదే తాజాగా పాకిస్తాన్ ఆటగాడు హ‌స‌న్‌ నవాజ్ ( Hasan Nawaz ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా బౌలర్లు అంటేనే తనకు చిరాకు, అసహ్యం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాళ్లు తన ముందుకు వస్తే వాళ్ళ ముఖాలు కూడా చూడాలంటే, ఇబ్బందిగా ఉంటుందని మండిపడ్డారు. ఇక టీమిండియా బౌల‌ర్లు వేసే బంతులను సిక్సర్లు కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతానని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

టీమిండియా బౌలర్లు అంటేనే చిరాకు..వ‌రుస‌గా సిక్సులు కొట్టి వాళ్ల తాట తీస్తా !

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో PSL తోపు టోర్నమెంట్ అంటూ పాకిస్తాన్ మాజీలు తెగ రెచ్చిపోతున్నారు. ఐపీఎల్ టోర్నమెంటులో ఫిక్సింగ్ జరుగుతోందని పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు హసన్ నవాజ్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని… టీమిండియా బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. ఇండియా పరువు తీసేలా వ్యవహరించాడు. టీమిండియా బౌలర్లు తన ముందుకు వచ్చినప్పుడు వాళ్లపై ఎదురు దాడి చేయాలని అనిపిస్తుందని పేర్కొన్నాడు. ప్రతి సారి తనకు అలాగే అనిపిస్తోందని తెలిపారు. ఇతర జట్ల ప్లేయర్ల కంటే.. టీమిండియా బౌలర్లు తనకు బౌలింగ్ చేస్తే సిక్సర్లు.. బౌండరీలు కొట్టి వాళ్లకు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు.

బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ లాంటి బౌలర్లను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా తాను దృష్టి పెడతానని వ్యాఖ్యానించారు. దీంతో హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే దీనిపై ఇండియన్ ఫాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ మండిపడుతున్నారు. వీడికి బ్యాటింగ్ చేతకాదు కానీ ఓవరాక్షన్ ఎక్కువ అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు టీమిండియా పై ఒకే ఒక్క అంతర్జాతీయ టి20 లో హసన్ నవాజ్ కు అవకాశం వచ్చింది. ఆసియా కప్ 2025 సందర్భంగా ఈ మ్యాచ్ జరగగా, అందులో కేవలం ఐదు పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో వికెట్ కోల్పోయాడు హసన్ నవాజ్.

Advertisement

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×