E-Paper
Advertisement

Abdul Razzaq: పాకిస్తాన్ కోచ్ మైక్ హెసన్‌ ర‌క్తం క‌క్కుకొని చావాలి..ర‌జాక్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

Abdul Razzaq: పాకిస్తాన్ కోచ్ మైక్ హెసన్‌ ర‌క్తం క‌క్కుకొని చావాలి..ర‌జాక్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు
Advertisement

Abdul Razzaq: పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan) ఈ మధ్య కాలంలో వరుసగా విఫలమవుతోంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ( Indian Premier League 2026 Tournament) సూపర్ 8 దశలో ఎలిమినేట్ అయింది పాకిస్తాన్. ఆ తర్వాత మొన్న బంగ్లాదేశ్ చేతిలో 11 సంవత్సరాల తర్వాత వన్డే సిరీస్ కోల్పోయింది. దీంతో పాకిస్తాన్ జట్టు పైన తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ జట్టు మాజీ ఆల్ రౌండ‌ర్ అబ్దుల్ ర‌జాక్ ( Abdul Razzaq) వివాద‌స్పద వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ మైక్ హెసన్ ( MIKE HESSON ) ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని, ర‌క్తం క‌క్కుకొని చావాలంటూ హాట్ కామెంట్స్ చేశారు అబ్దుల్ ర‌జాక్. 2007 వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌యంలో బాబ్ వూల్మెర్ ( Bob Woolmer) లాగా హెడ్ కోచ్ మైక్ హెసన్ చ‌నిపోవాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో మాజీ ఆల్ రౌండ‌ర్ అబ్దుల్ ర‌జాక్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Kohli-Charter Flight: 3 రోజులకోసారి లండ‌న్ పోతా..చార్టెడ్ ఫ్లైట్ కొనివ్వండి, RCBని టార్చ‌ర్ చేస్తోన్న విరాట్ కోహ్లీ

పాకిస్తాన్ కోచ్ ర‌క్తం క‌క్కుకొని చావాల్సిందే

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఈ మధ్య కాలంలో చెత్త ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో జట్టులో ప్రక్షాళన చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీపై కూడా వేటు వేయాలని షోయబ్ అక్తర్ లాంటి ప్లేయర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ కోచ్ బాబ్ వూల్మెర్ తరహాలోనే ప్రస్తుత పాకిస్తాన్ కోచ్ మైక్ హెస‌న్ ఆత్మహత్య చేసుకోవాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ జట్టు వైఫల్యాలకు బాధ్యత వహించి మైక్ హెస‌న్ చచ్చిపోవాలి అంటూ దారుణంగా విమర్శలు చేశారు. దీంతో అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పాకిస్తాన్ ప్లేయర్లు విఫలమైతే కోచ్ మైక్ హెస‌న్ ను ఎందుకు చావాలి? తలా తోక లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావ్? మీ పాకిస్తాన్ ప్లేయర్లు సరిగ్గా ఆడాలని ఇండియన్ ఫ్యాన్స్ కూడా ట్రోలింగ్ చేస్తున్నారు.

బాబ్ వూల్మెర్ ఎలా ఆత్మహత్య చేసుకున్నాడు ?

2007 సంవత్సరం సమయంలో వన్డే వరల్డ్ కప్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాకిస్తాన్ కోచ్ గా బాబ్ వూల్మెర్ వ్యవహరించాడు. అయితే ఆ ప్రపంచ కప్ సమయంలో ఐర్లాండ్ చేతిలో పాకిస్తాన్ అత్యంత దారుణంగా ఓడిపోయి టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు పాకిస్తాన్ కోచ్ బాబ్ వూల్మెర్ ఓ గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించి అందరికి షాకిచ్చాడు. ఈ సంఘటన అప్పట్లో క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిందని చెప్పవచ్చు. అయితే పాకిస్తాన్ ఓటమికి బాధ్యత వహించి అతడే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా ఆయనను హత్య చేశారా ? అనేది తెలియదు. ఇప్పటికీ ఆ సంఘటన మిస్టరీగానే ఉంది. అయితే అచ్చం అలాగే నువ్వు కూడా చచ్చిపో అంటూ ప్రస్తుత కోచ్ మైక్ హెస‌న్ ను ఉద్దేశించి అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

 

Also Read: Irfan Pathan On CSK: 44 ఏళ్ల ధోని డ్రెస్సింగ్ రూంలో కూర్చుంటేనే బెటర్..స‌ర్ఫ‌రాజ్ లాంటి కుర్రాళ్ల‌కు ఛాన్స్ ఇవ్వాలి

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×