E-Paper
Advertisement

IPL 2026: ఐపీఎల్ లో కొత్త రూల్స్‌.. డ్రామాలు చేస్తే తోక క‌ట్ చేయ‌డ‌మే, హ్యారీ బ్రూక్ పై రెండేళ్ల బ్యాన్‌

IPL 2026: ఐపీఎల్ లో కొత్త రూల్స్‌.. డ్రామాలు చేస్తే తోక క‌ట్ చేయ‌డ‌మే, హ్యారీ బ్రూక్ పై రెండేళ్ల బ్యాన్‌
Advertisement

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} 2026 మినీ వేలం డిసెంబర్ 16న దుబాయ్ లోని అబుదాబి వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మినీ వేలం కోసం మొత్తం 1,355 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 350 మందిని షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఈ లిస్టులో చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన 35 మంది ఆటగాళ్లు ఉండడం గమనార్హం.

Also Read: IPL 2026: 1355 మంది ప్లేయర్లపై వేటు, 350 క్రికెటర్లకే ఛాన్స్.. ఐపీఎల్ మినీ వేలం కొత్త టైమింగ్స్ ఇవే

Advertisement

సౌత్ ఆఫ్రికా స్టార్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మొదట తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో మొదట ప్రకటించిన జాబితాలో అతడి పేరు రాలేదు. కానీ చివరి నిమిషంలో తన మనసు మార్చుకొని వేలంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని ఫ్రాంచీల అభ్యర్థన మేరకు డికాక్ ని తుది జాబితాలో చేర్చారు. ఈ క్రమంలో డికాక్ తన బేస్ ధరను 50% తగ్గించుకున్నాడు. కోటి రూపాయలతో అతడు మినీ వేలం బరిలో దిగనున్నాడు.

 

హ్యరీ బ్రూక్ పై రెండేళ్ల పాటు నిషేధం:

Advertisement

ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్.. టోర్నీ నుండి తప్పుకోవడంతో బీసీసీఐ అతనిపై రెండేళ్లపాటు నిషేధం విధించింది. ఎందుకంటే వేలం తర్వాత సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుండి వైదొలిగితే ఆటగాళ్లపై ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో బ్రూక్ ఐపీఎల్ 2025-26 సీజన్లకు దూరమయ్యాడు. ఇది బ్రూక్ కెరీర్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇతడిని ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది.

కానీ టోర్నీ ప్రారంభానికి ముందే వైదొలిగాడు. వేలంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసిన తరువాత.. ఆ ఆటగాడు గాయపడితే తప్ప ఇతర ఏ కారణంతోను విదేశీ ఆటగాళ్లు వైదొలిగిన రెండు సంవత్సరాల పాటు నిషేధం తప్పదని ఐపీఎల్ నిబంధనలలో స్పష్టంగా ఉంది. ఈ రూల్ విధించిన తర్వాత నిషేధం ఎదుర్కొన్న తొలి ఆటగాడు హ్యారీ బ్రూక్. అయితే ఇతడు ఐపీఎల్ కంటే తనదేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక ఐపీఎల్ నుండి తప్పుకోవడం పై ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇతడు క్షమాపణలు తెలిపాడు. ఇది చాలా కష్టమైన నిర్ణయమే కానీ.. దేశం కోసం ఆడడానికే ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపాడు.

Also Read: Kohli – Gambhir: కోహ్లీ, గంభీర్ మధ్య మళ్ళీ పాత గొడవలు? వీడియో వైరల్

 

మినీ వేలం రూల్స్:

ఈ మినీ వేలంలో అన్ని జట్లు కలిపి మొత్తం 77 స్లాట్ లు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో 31 విదేశీ స్థానాలు ఉన్నాయి. అయితే ఈ వేలం మొదట క్యాప్డ్ ఆటగాళ్లతో ప్రారంభం అవుతుంది. ఇందులో బ్యాటర్లు, వికెట్ కీపర్ కం బ్యాటర్, ఆల్ రౌండర్, ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్లు ఉంటారు. ఆ తరువాత అన్ క్యాప్డ్ ఆటగాళ్లతో పూర్తి రౌండ్ కొనసాగుతుంది. మొదటి 70 మంది ఆటగాళ్ల వేలం పూర్తయిన తర్వాత.. మిగిలిన ప్లేయర్ల కోసం యాక్సిలరేటెడ్ రౌండ్ ని నిర్వహిస్తారు. ఇక చివరగా తొలి మూడు రౌండ్ లలో అమ్ముడుపోని ఆటగాళ్లు ఆఖరిలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.

 

 

View this post on Instagram

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×