// // Warner Vs Moeen Ali: మొయిన్ అలీపై డేవిడ్ వార్న‌ర్ దాడి..! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

PSLలో మ‌రో వివాదం..కరాచీ కింగ్స్ జట్టులో ముసలం, మొయిన్ అలీపై డేవిడ్ వార్న‌ర్ దాడి..!

PSLలో మ‌రో వివాదం..కరాచీ కింగ్స్ జట్టులో ముసలం, మొయిన్ అలీపై డేవిడ్ వార్న‌ర్ దాడి..!
Advertisement

Warner Vs Moeen Ali:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) మంచి వ్యూయర్షిప్ సాధిస్తూ దూసుకు వెళ్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ ( Pakistan Super League 2026 ) మాత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయింది. ప్రతి మ్యాచ్ లోను ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. మరియం నవాజ్ షరీఫ్ పైన పెట్టిన వివాదాస్పద పోస్టు నుంచి మొదలుకొని బాల్ టాంపరింగ్ వరకు అబ్బో చెప్పుకుంటూ పోతే, ఎన్నో ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా మరో ఇన్సిడెంట్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా జరిగింది. కరాచీ కింగ్స్ జట్టులో ( Karachi Kings) ముసలం నెలకొంది. ఈ జట్టుకు సంబంధించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ ( DAVID WARNER), మొయిన్ అలీ మధ్య చిన్నపాటికి గొడవ చోటుచేసుకుంది. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత ఈ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే మొయిన్ అలీ పైన ( MOEEN ALI) దాడి చేసే ప్రయత్నం చేశాడు డేవిడ్ వార్నర్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read: IPL 2026: KKRపై స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విజ‌యం..పాకిస్తాన్ లో సంబ‌రాలు, తగలబడుతున్న బంగ్లాదేశ్

కరాచీ కింగ్స్ జట్టులో ముసలం.. ఒకరిపై మరొకరు దాడి

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా కరాచీ కింగ్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కరాచీ కింగ్స్ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక నిన్న కరాచీ కింగ్స్ వర్సెస్ రావల్పిండి జట్ల మధ్య పదో మ్యాచ్ జరిగింది. ల‌హోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే, ఇందులో అద్భుతంగా రాణించిన కరాచీ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విక్టరీ అనంతరం కరాచీ జట్టులో ముసలం చోటు చేసుకుంది. ఏమైందో తెలియదు కానీ డేవిడ్ వార్నర్ అలాగే మొయిన్ అలీ మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా వేలు పెట్టి మరి మొయిన్ అలీని బెదిరించే ప్రయత్నం చేశాడు డేవిడ్ వార్నర్. అంతేకాదు అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కరాచీ కింగ్స్ జట్టుకు సంబంధించిన మెంటార్, జోక్యం చేసుకున్నారు. అక్కడి నుంచి డేవిడ్ వార్న‌ర్ ను మెల్లగా సైడ్ చేశారు. దీంతో గొడవ కాస్త చల్లబడింది లేకపోతే, గ్రౌండ్ లోనే ఇద్దరు తన్నుకునే వాళ్ళు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్ గా మారింది. దీనిపై బినాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ దారుణంగా ర్యాగింగ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో రావ‌ల్పిండి నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో కరాచీ కింగ్స్ ఛేదించి విజయం దక్కించుకుంది.

Advertisement

Also Read: బుమ్రా బౌలింగ్ లో ఫ‌ర్హాన్‌ 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు కొడ‌తాడు..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా పాకిస్తాన్ బార్డ‌ర్‌లో తిరుగుతా

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×