E-Paper
Advertisement

Bhuvi breaks Bumrah’s record : బుమ్రా రికార్డు తుడిచేసిన భువీ

Bhuvi breaks Bumrah’s record : బుమ్రా రికార్డు తుడిచేసిన భువీ
Advertisement

Bhuvi breaks Bumrah’s record : టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రికార్డు బద్దలైంది. పేసర్ భువనేశ్వర్ కుమార్… బుమ్రా రికార్డును అధిగమించాడు. T20 మ్యాచ్ ల్లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన భారత బౌలర్ గా భువీ రికార్డులకెక్కాడు. T20 వరల్డ్ కప్ సూపర్-12లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో భువనేశ్వర్ ఈ రికార్డు సాధించాడు. తొలి ఓవర్‌ తొలి బంతికే వికెట్ పడగొట్టిన భువీ… ఆ ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడెన్ వేశాడు. దాంతో… T20 మ్యాచ్ ల్లో 21 ఓవర్లు మెయిడెన్ వేసిన తొలి భారత బౌలర్ గా భువీ రికార్డు సృష్టించాడు. బుమ్రా ఖాతాలో 19 మెయిడెన్లు ఉండగా, భువీ ఆ రికార్డును అధిగమించి… 21 మెయిడెన్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో 3 ఓవర్లు వేసిన భువనేశ్వర్… 11 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

T20 మ్యాచ్ ల్లో ఇప్పటిదాకా 27 మెయిడెన్ ఓవర్లు వేసిన వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్… ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ 23 మెయిడెన్లు, విండీస్ క్రికెటర్ శామ్యూల్ బద్రీ 21 మెయిడెన్లు వేసిన బౌలర్లుగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. 21 మెయిడెన్లతో భువనేశ్వర్ కుమార్, 19 మెయిడెన్లతో బుమ్రా… నాలుగు, ఆరు స్థానాల్లో ఉన్నారు. గాయం కారణంగా T20 వరల్డ్ కప్ కు బుమ్రా దూరం కావడంతో… అతని రికార్డును బ్రేక్ చేసే అవకాశం భువనేశ్వర్ కుమార్ కు దక్కింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×