E-Paper
Advertisement

Ben Stokes : ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ లో హిస్టరీ క్రియేట్ చేసిన స్టోక్స్..!

Ben Stokes : ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ లో హిస్టరీ క్రియేట్ చేసిన స్టోక్స్..!
Advertisement

Ben Stokes :   మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 358 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయింది. ఇక ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 669 పరుగుల భారీ స్కోర్ చేసింది. మళ్లీ టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో ఖాతా కూడా తెరవకుండానే వోక్స్ బౌలింగ్ లో ఓపెనర్ జైస్వాల్, మరో బ్యాటర్ సాయి సుదర్శన్ డకౌట్ గా వెనుదిరిగారు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం కే.ఎల్. రాహుల్, శుబ్ మన్ గిల్ పరుగుల కోసం పోరాడుతున్నారు. ఇదిలా ఉంటే.. నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు రూట్, స్టోక్స్ సెంచరీలు చేశారు. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అయితే బౌలింగ్ లో బంతితో.. బ్యాటింగ్ లో బ్యాట్ తో రెండింటిలో అద్భుతంగా ఆడాడు. దీంతో ఓ భారీ రికార్డును తన సొంతం చేసుకున్నాడు.

Also Read : ASia Cup 2025 : భారత్-పాక్ మ్యాచ్ డేట్ ఫిక్స్.. ఆసియా కప్ షెడ్యూల్ ఇదే..!

Advertisement

ఇంగ్లాండ్ కెప్టెన్.. ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డు..

తొలి ఇన్నింగ్స్ లో 24 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన స్టోక్స్.. 72 పరుగులు ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అదేవిధంగా బ్యాటింగ్ లో 141 పరుగులు చేశాడు. ఈ టెస్ట్ మ్యాచ్ లో 5 వికెట్ల ప్రదర్శన చేయడంతో పాటు సెంచరీ సైతం సాధించాడు. 148 ఏళ్ల ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన తొలి ఇంగ్లీషు కెప్టెన్ గా నిలిచాడు. ఇప్పటివరకు మొత్తంగా 82 మంది ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్లు గా వ్యవహరిస్తే.. ఈ ఘనత సాధించింది మాత్రం బెన్ స్టోక్స్ ఒక్కడే కావడం విశేసం. ఓవరాల్ గా మాత్రం బెన్ స్టోక్స్ 5వ కెప్టెన్ గా నిలిచాడు. అంతకు ముందు వెస్టిండీస్ కి చెందిన డిన్నీస్ అట్కిన్సన్, గ్యారీ సోబర్స్, పాకిస్తాన్ కి చెందిన ముస్తాక్ మొహమ్మద్, ఇమ్రాన్ ఖాన్ లు ఈ ఘనత సాధించారు. అదేవిధంగా ఒకే మ్యాచ్ లో 5 వికెట్లు, సెంచరీ చేసిన ఇంగ్లీషు బ్యాటర్ల జాబితాలో స్టోక్స్ నాలుగో క్రికెటర్ గా నిలిచాడు.

Advertisement

ఓవరాల్ గా స్టోక్స్ ఏడో క్రికెటర్.. 

బెన్ స్టోక్స్ కంటే ముందు టోనీ జార్జీ, ఇయాన్ బోథమ్, గన్ అట్కిన్ సన్ ఉన్నారు. ఓవరాల్ గా స్టోక్స్ ఈ రికార్డు సాధించిన ఏడో క్రికెటర్ గా చరిత్ర సృష్టించారు. అతని కంటే ముందు కోలీ స్మిత్, గ్యారీ సోబర్స్, బ్రూస్ టైలర్, ఇయాన్ బోథమ్, ఇమ్రాన్ ఖాన్, రోస్టన్ చేస్ ఉన్నారు. అదేవిధంగా టెస్ట్ క్రికెట్ లో 7వేల పరుగులు సాధించి.. 200 వికెట్లు తీసిన మూడో క్రికెటర్ గా కూడా నిలిచాడు స్టోక్స్. అతని కంటే ముందు ఈ జాబితాలో గ్యారీ సోబర్స్, జాక్వెస్ కలీస్ ఉన్నారు. మొత్తానికి బెన్ స్టోక్స్ వరల్డ్ క్లాస్ ఆల్ రౌండర్ గా తన సత్తా చాటుతున్నాడు. ఈ మ్యాచ్ లో జోరూట్ 150 కూడా భారీ శతకం సాధించాడు. ప్రస్తుతం టెస్టుల్లో అతను అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×