E-Paper
Advertisement

BCCI: మీరు ఎంత గింజుకున్నా, గంభీర్ ను తొల‌గించేది లేదు.. 2027 వ‌ర‌కే అత‌డే !

BCCI: మీరు ఎంత గింజుకున్నా, గంభీర్ ను తొల‌గించేది లేదు.. 2027 వ‌ర‌కే అత‌డే !
Advertisement

BCCI : దక్షిణాఫ్రికా చేతులో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ అయిన నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వెంటనే గౌతమ్ గంభీర్ ను తొలగించాలని టీమిండియా అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) తప్పుడు నిర్ణయాల వల్ల సొంత గడ్డపై కూడా టీమిండియా ఓడిపోతుందని విమర్శలు చేస్తున్నారు. వెంటనే అతని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్తను నియామకం చేయాలని కోరుతున్నారు. అయితే సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్ పై వస్తున్న వ్యతిరేకతపై తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించింది. ఎవరెంత గింజుకున్నా గౌతమ్ గంభీర్ కోచ్ కొనసాగుతాడని వెల్లడించింది బీసీసీఐ ( BCCI).

Also Read: Gambhir: ఆసియా, చాంపియన్స్ ట్రోఫీ నేనే తీసుకువచ్చా.. దక్షిణాఫ్రికాతో ఓటమికి టీమిండియా ప్లేయర్లే కారణం, నా తప్పేం లేదు

గంభీర్ పై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం ఉండదు

Advertisement

దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ను తొలగిస్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అటు గౌత‌మ్ గంభీర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. తన భవిష్యత్తు మొత్తం బీసీసీఐ చేతిలో ఉందని, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్న తనకు ఓకే అంటూ గంభీర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో గౌత‌మ్ గంభీర్ వ్యాఖ్యలపై స్పందించింది బీసీసీఐ. గౌతమ్ గంభీర్ పై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం ఉండబోదని వెల్లడించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ మేరకు బీసీసీఐ అధికారి మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం టీమిండియా జట్టు మార్పుల దశలో ఉందని వెల్లడించారు. అయితే రెండు కోచ్ మార్పు మాత్రం ఉండకూడదని ఆయన సంకేతాలు ఇచ్చారు. 2027 వరకు దాదాపు గౌతమ్ గంభీర్ ఉంటాడని పరోక్షంగా హిట్ ఇచ్చారు స‌దరు బీసీసీఐ అధికారి.

2027 వ‌ర‌కూ గంభీర్ కొన‌సాగింపు.. బీసీసీఐ షాకింగ్ నిర్ణ‌యం

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను తొలగించి కొత్త కోచ్ ను నియామకం చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. కానీ భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం దీనిపై వెనక్కి అడుగు వేసే సమస్య లేనట్లే వ్యవహరిస్తోంది. 2027 వరకు గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కర్ లాంటి సెలక్షన్ కమిటీని కొనసాగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. 2027 తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి, మార్పుపై నిర్ణయం తీసుకునే ఛాన్సులు ఉన్నాయి. నిజంగానే గౌతమ్ గంభీర్ ను తొలగిస్తే వివిఎస్ లక్ష్మణ్ కు అవకాశం ఇవ్వాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది మహేంద్ర సింగ్ ధోనీకి హెడ్ కోచ్ బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నారు. చివరికి రవి శాస్త్రికి అయినా ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెబుతున్నారు. వాళ్ల ఆధ్వర్యంలోనే మళ్లీ టీమిండియా గాడిలో పడుతుందని అంటున్నారు.

Advertisement

Also Read:  WTC 2025-27 points table: WTC పాయింట్ల పట్టికలో టీమిండియాకు షాక్ ఇచ్చిన పాకిస్తాన్.. మనోళ్లను వెనక్కి నెట్టిన శత్రుదేశం

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×