E-Paper
Advertisement

Team India Salaries: టీమిండియా క్రికెట‌ర్ల జీతాలు భారీగా పెంపు..ఒక్కో మ్యాచ్ కు ఎంతంటే

Team India Salaries:  టీమిండియా క్రికెట‌ర్ల జీతాలు భారీగా పెంపు..ఒక్కో మ్యాచ్ కు ఎంతంటే
Advertisement

Team India Salaries: టీమిండియా మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి.  దేశీయ క్రికెట్ ఆడే టీమిండియా మహిళా క్రికెటర్ల జీతాలను ( Team India Salaries) భారీగా భారత్ క్రికెట్ నియంత్రణ మండలి పెంచినట్లు తెలుస్తోంది. ఒక వన్డే మ్యాచ్ ఆడితే 50 వేల రూపాయలు, టి20 ఆడితే 25 వేల రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందట. అంటే గ‌తంలో ఇచ్చే మ్యాచ్ ఫీజుల కంటే, ఇప్పుడు డ‌బుల్ ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకుంద‌ట బీసీసీఐ. అయితే ఇందులో సీనియర్ క్రికెటర్లకు ఒకలాగా, జూనియర్ క్రికెటర్లకు మరోలాగా ఫీజులు నిర్ణయించారు. గ్రేడ్ ఏ లో ఉన్న హ‌ర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన, దీప్తి శర్మ లకు భారీగా జీతాలు అంద‌నున్నాయి.

Also Read:  INDW vs SLW 1st T20I: పెళ్లి త‌ర్వాత స‌రికొత్త రికార్డు..4 వేల ప‌రుగుల క్ల‌బ్ స్మృతి, వైజాగ్ టీ20లో టీమిండియా విజ‌యం

దేశవాళీ మ‌హిళా క్రికెటర్ల జీతాల పెంపు ?

Advertisement

దేశవాళీ మహిళా క్రికెటర్ల జీతాలు పెంచుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ క్రికెటర్లు దేశవాళీ మ్యాచ్ ఆడితే, 50 వేల వరకు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందట బీసీసీఐ. అంతకు ముందు 20,000 మాత్రమే ఇచ్చేవారు. ఈ ప్లేయర్లు ప్లేయింగ్ 11 లో ఉంటే మాత్రమే ఈ స్థాయిలో అమౌంట్ దక్కుతుంది. రిజర్వు ఆటగాళ్లకు 25 వేల రూపాయలు అందించనున్నారట. ఇక జూనియర్ మహిళా క్రికెటర్లకు ప్రతి మ్యాచ్ కు గతంలో 10,000 దక్కేవి. ఇక ఇప్పుడు ఒక్కో మ్యాచ్ ఆడితే 25,000 ఇచ్చేందుకు బీసీసీ నిర్ణయం తీసుకుందట. రిజర్వు ప్లేయర్లకు 12,500 చెల్లించనున్నారు. టి20 మ్యాచ్ లు ఆడితే ఒక్కో మ్యాచ్ కు 25వేల రూపాయలు సీనియర్లకు దక్కనున్నాయి. అదే జూనియర్ క్రికెట‌ర్లు అయితే, 12,500 ఫీజు ఇచ్చేందుకు తాజాగా బీసీసీఐ నిర్ణయం తీసుకుందట. పైన పేర్కొన్న ఫీజు వివరాలు కేవలం దేశవాళీ మ్యాచ్ లు ఆడే క్రికెటర్లకు మాత్రమే.

అంతర్జాతీయ మ్యాచ్ ఫీజులు ఎంతంటే?

టీమిండియా మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా అంతర్జాతీయ మ్యాచ్ లకు ఫీజులు ఇస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. 2022 సంవత్సరం నుంచి ఈ రూల్స్ తీసుకువచ్చింది. అప్పటి నుంచి ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడిన మహిళా క్రికెటర్ కు రూ. 15 లక్షలు అందిస్తున్నారు. అదే సమయంలో వన్డే మ్యాచ్ ఆడితే ఆరు లక్షలు అలాగే టీ20లు ఆడితే మూడు లక్షలు ఇస్తున్నారు. ఈ నిర్ణయంతో దేశవాళీ క్రికెట్ ఆడే సీనియర్ ప్లేయర్ కు ఏడాదికి దాదాపు రూ. 12 లక్షల నుంచి రూ. 14 లక్షల వరకు డబ్బులు వస్తున్నాయి. ఇక గ్రేడ్ ఏ లో ఉండే ప్లేయర్లకు 50 లక్షలు వార్షిక ఆదాయం వస్తోంది. గ్రేడ్ బీలో ఉండే ప్లేయర్లకు 30 లక్షలు చొప్పున అందిస్తున్నారు. గ్రేడ్ సిలో ఉన్న వాళ్లకు 10 లక్షలు ఏడాదికి వస్తున్నాయి.

Advertisement

Also Read: U19 Asia Cup 2025: ఊర కుక్క‌ల్లాగా రెచ్చిపోయిన పాకిస్తాన్ ప్లేయ‌ర్లు..బ్యాన్ చేసేందుకు ఐసీసీ స్కెచ్ ?

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×