E-Paper
Advertisement

Temba Bavuma – Pant: తెంబా బ‌వుమా ఓ మ‌ర‌గుజ్జుగాడు.. బాడీ షేమింగ్ కామెంట్స్ చేసిన పంత్‌

Temba Bavuma – Pant: తెంబా బ‌వుమా ఓ మ‌ర‌గుజ్జుగాడు.. బాడీ షేమింగ్ కామెంట్స్ చేసిన పంత్‌
Advertisement

Temba Bavuma – Pant: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ సమరం నేడు మొదలైంది. ఈ రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్ట్ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బవుమా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Also Read: Shardul Thakur: ఒక‌టి కాదు, రెండు కాదు.. 8 జ‌ట్లు మారిన ఏకైక ఆట‌గాడు

Advertisement

ఈ మ్యాచ్ కి స్టార్ ఫాస్ట్ బౌలర్ కగీసో రబాడ దూరం కాగా.. అతడి స్థానంలో భాష్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక భారత జట్టు ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్ లతో బరిలోకి దిగింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే సూపర్ ఫామ్ లో ఉన్న వికెట్ కీపర్ కం బ్యాటర్ దృవ్ జురెల్ సైతం ప్లేయింగ్ లెవెన్ లో చోటు దక్కించుకున్నాడు. ఇక అక్షర్ పటేల్ కూడా కం బ్యాక్ ఇచ్చాడు. ఇరుజట్లు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో మాత్రమే ఆడుతున్నాయి.

తడబడుతున్న సౌత్ ఆఫ్రికా:

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా ఓపెనర్లు తడబడ్డారు. సౌత్ ఆఫ్రికా 57 పరుగుల వద్ద తన తొలి వికెట్ ని కోల్పోయింది. 23 పరుగులు చేసిన ర్యాన్ రికెల్టన్.. బుమ్రా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వియాన్ ముల్డర్ వచ్చాడు. అనంతరం ఐడైన్ మార్క్రమ్ {31} రూపంలో సౌత్ఆఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్ లోనే వికెట్ కీపర్ పంత్ కి క్యాష్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత బవుమా రూపంలో సౌత్ఆఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. మూడు పరుగులు చేసిన బవుమా.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దీంతో మొదటి రోజు లంచ్ సమయానికి సౌత్ ఆఫ్రికా 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజ్ లో టోనీ డి జోర్జి {15*}, ముల్డర్ {22*} ఉన్నారు.

బాడీ షేమింగ్ కామెంట్స్ చేసిన పంత్:

Advertisement

దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా పై బాడీ షేమింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్. బుమ్రా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయిన అయిన సమయంలో.. బుమ్రా అప్పీల్ చేశాడు. దీంతో టీమిండియా క్రికెటర్లంతా ఒకచోటకి చేరుకున్నారు. ఈ సమయంలో బవుమా పొట్టిగా ఉన్నాడు కదా.. అవుట్ అనిపిస్తుంది అన్నాడు పంత్.

Also Read: PAK VS SL: పాకిస్తాన్ లో శ్రీలంక ప్లేయ‌ర్ల‌కు VVIP సెక్యూరిటీ.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

కానీ బంతి వికెట్ల కంటే హైట్ వెళ్లిందని భావించిన బుమ్రా.. రివ్యూ వద్దనుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో పంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే చూడడానికి బవుమా పొట్టిగా కనిపించినా.. తనకు క్రికెట్ పై ఎంతో నైపుణ్యం ఉంది. గతంలో కూడా ఇలా బాడీ షేమింగ్ కి గురైన సందర్భాలలో కూడా.. తాను ఇటువంటి వాటిని పట్టించుకోనని స్పష్టం చేశాడు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×