// //
T20 WORLD CUP 2026: ఇండియా, బంగ్లాదేశ్ ( Bangladesh) మధ్య కాంట్రవర్సీ చోటు చేసుకున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) ఇండియాలో పర్యటించబోమని తాజాగా ఐసీసీకి లేఖ రాసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. ముస్తాఫిజుర్ రహమాన్ ( Bangladesh-Mustafizur ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఆడకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చింది. దీంతో అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ పరువు పోయింది. అయితే ఈ ఇష్యూ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాలో జరిగే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో వేదికలు మార్చితేనే ఆడతామని పేర్కొంది. కానీ ఇండియాలో మాత్రం అడుగు పెట్టేది లేదని ఐసీసీకి వివరించింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. దీంతో టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో బంగ్లాదేశ్ ఆడేది కష్టమే అని అంటున్నారు.
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ జట్టుకు సంబంధించిన ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి ప్లేయర్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఆడించకూడదని ఆదేశాలు ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే బిసిసిఐ తీసుకున్న ఈ నిర్ణయం పైన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్, చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఇండియాలో జరగనున్న నేపథ్యంలో.. వాళ్ల దేశంలో పర్యటించబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు లేక కూడా రాసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ టీమ్ ఆడే మ్యాచ్ లు నిర్వహించిన తరహాలోనే తమ మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహించాలని కొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చింది. అలా అయితేనే టి20 ప్రపంచ కప్ పాడుతామని స్పష్టం చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. అయితే దీనిపై ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో వేదికలు మార్చాలంటే అస్సలు కుదరదని భారత క్రికెట్ నియంత్రణ మండలి వెల్లడించింది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది.. మధ్యలో తాము పర్యటించబోమంటే కుదరదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే అన్ని జట్ల ప్లేయర్లకు సంబంధించిన విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్ అయిపోయాయి… ఇలాంటి తరుణంలో శ్రీలంకకు మ్యాచ్ లు తరలించాలంటే కష్టమే అని తెలిపింది. మీకు ఇష్టం ఉంటే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) ఆడండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి అంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ( BCB) కౌంటర్ ఇచ్చింది బీసీసీఐ ( BCCI).
Also Read: Ravichandran Ashwin: టీ20 వరల్డ్ కప్ 2026 కంటే సీరియల్స్ చూడటం బెటర్..టీమిండియా ఆడటం దండగే
🚨 CONFIRMED – BANGLADESH TEAM WILL NOT TRAVEL TO INDIA FOR T20 WORLD CUP 2026 🚨 pic.twitter.com/aVF29iqMoY
— Tanuj (@ImTanujSingh) January 4, 2026