E-Paper
Advertisement

Ban On Naseem Shah: ఆ లేడీపై వివాద‌స్ప‌ద పోస్ట్..పాక్ బౌల‌ర్ నసీమ్ షాపై శాశ్వ‌త‌ నిషేధం !

Ban On Naseem Shah: ఆ లేడీపై వివాద‌స్ప‌ద పోస్ట్..పాక్ బౌల‌ర్ నసీమ్ షాపై శాశ్వ‌త‌ నిషేధం !
Advertisement

Ban On Naseem Shah: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament)  నిన్న చాలా అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అభిమానులు లేకపోయినా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ ఈవెంట్ ను గ్రాండ్ గానే నిర్వహించింది. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగా నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ షరీఫ్ ( CM Punjab Maryam Nawaz Sharif ) ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి మరియం నవాజ్ షరీఫ్ రావడం పై పాకిస్తాన్ పాస్ట్ బౌలర్ నసీమ్ షా ( Naseem Shah ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమైనా మహారాణినా? అతిథి మర్యాదలు ఎందుకు చేశారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీని ఉద్దేశించి వివాదాస్పద పోస్ట్ పెట్టారు నసీమ్ షా. కానీ ఈ పోస్ట్ పెట్టిన ఐదు నిమిషాలకే డిలీట్ చేశాడు నసీమ్ షా. అయితే, అప్పటికే ఆ పోస్ట్ వైర‌ల్ అయి, ఇప్పుడు దుమారం రేపుతోంది.. అంతేకాదు నసీమ్ షా పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిషేధం ( Ban On Naseem Shah ) కూడా విధిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

Also Read: Tanveer Ahmed On PSL: ఛీ..ఛీ నిజంగా పాకిస్తాన్ బికారి దేశమే..కెప్టెన్స్‌ ప్రెస్ మీట్ ను పెళ్లి పందిరిగా మార్చారు క‌ద‌రా

నసీం షా పైన బ్యాన్ వేసేందుకు రంగం సిద్ధం ?

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభ ఈవెంట్ సందర్భంగా నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ షరీఫ్ ప్రత్యేక ఆహ్వానితురాలిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు స్పెషల్ గా మర్యాదలు చేశారు న‌ఖ్వీ. దీనిపై సోషల్ మీడియా వేదికగా తన నిరసన తెలిపారు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా. తన పాత కక్షలను గుర్తు చేసుకొని, మరియం నవాజ్ షరీఫ్ ను ఉద్దేశించి వివాదాస్పద పోస్ట్ పెట్టారు. ఆమె ఏమైనా మహారాణినా ? దేశం కోసం ఆమె ఏం చేసిందని నిలదీస్తూ పోస్ట్ పెట్టాడు నసీమ్ షా. అయితే క్షణాల్లోనే ఈ పోస్టు వైరల్ కావడంతో వెంటనే డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ఈ పోస్టు వివాదంగా మారిపోయింది. పాకిస్తాన్ సర్కార్ తో పాటు, PCB దాకా ఈ వివాదం వెళ్ళింది. దీంతో నసీమ్ షాపైన‌ పర్మినెంట్ నిషేధం విధించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుందని చర్చ జరుగుతోంది.

ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుడు అన్న కారణంగానే నిషేధం

మరియం నవాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా పోస్టు పెట్టిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కు మద్దతుదారుడు. అందుకే అతనిపై మొదటి నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కక్షపూరితంగానే వ్యవహరిస్తోందని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు చెబుతున్నారు. 2023 ఆసియా కప్ సమయంలో నసీమ్ షా భుజానికి గాయమైంది. అప్పుడు లండన్ లో ట్రీట్మెంట్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డును డబ్బులు అడిగాడు నసీమ్ షా. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొండి చేయి చూపించింది. దీంతో స్తోమత లేక ఇస్లామాబాదులోనే తన సొంత డబ్బుతో ట్రీట్మెంట్ తీసుకున్నాడు నసీమ్ షా. ఈ మేరకు అప్పట్లో దీనిపై ఆరోపణలు వచ్చాయి. అయితే అదే సమయంలో ఇదే మరియం నవాజ్ షరీఫ్ కు అనారోగ్యం జరిగితే లండన్ లో ట్రీట్మెంట్ అందించారట. ఇక ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా ఆమెను మహారాణిల ట్రీట్ చేశారు నఖ్వీ. దీంతో మండిపోయిన నసీమ్ షా, అభిమానులను స్టేడియంలోకి రాకుండా నిషేధించి.. మరియం నవాజ్ షరీఫ్ ను మహారాణిలా ట్రీట్ చేస్తారా ? అని మండిపడ్డారు. అయితే ఈ ట్వీట్ నేపథ్యంలో ఇకపై క్రికెట్ ఆడకుండా నసీమ్ షాపై నిషేధం విధించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుందట. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో నఖ్వీ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: IPL 2026 2nd Phase Schedule: ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..ఆ ఈవెంట్ ర‌ద్దు, ఫైన‌ల్స్ ఎప్పుడంటే

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×