E-Paper
Advertisement

Bad Experience to Newzealand : న్యూజిలాండ్‌కు అచ్చిరాని వరల్డ్‌కప్‌లు

Bad Experience to Newzealand : న్యూజిలాండ్‌కు అచ్చిరాని వరల్డ్‌కప్‌లు
Advertisement

Bad Experience to Newzealand : క్రికెట్ ఆడే దేశాల్లో అత్యంత దురదృష్టమైన జట్టు ఏదైనా ఉందంటే… అది సౌతాఫ్రికానే. ఎందుకంటే… ఎప్పుడూ బలమైన జట్టుగా పిలవబడే సౌతాఫ్రికా టీమ్… వరల్డ్‌కప్‌ల్లో ఎప్పుడూ బోల్తాకొడుతూనే ఉంది. ఇప్పటికీ ఒక్క వరల్డ్‌కప్‌ కూడా సౌతాఫ్రికా ఖాతాలో లేదు. సౌతాఫ్రికా తర్వాత అత్యంత దురదృష్టమైన జట్టు న్యూజిలాండే. ఎందుకంటే… ఆ జట్టు ఖాతాలోనూ ఇప్పటికీ ఒక్క వరల్డ్ కప్ కూడా లేదు. మరి T20 వరల్డ్‌కప్‌లో సెమీస్ దాకా వచ్చిన కివీస్… ఈసారైనా వరల్డ్‌కప్‌ను ముద్దాడుతుందా? లేదా? అని న్యూజిలాండ్ ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.

కివీస్ ఎప్పుడూ బ్లాక్ కలర్ జెర్సీతో బరిలోకి దిగుతుంది. ఆ రంగు జెర్సీ మార్చేదాకా న్యూజిలాండ్ ఐసీసీ ట్రోఫీలు గెలవలేదనే నమ్మకం చాలా బలంగా ఉంది. అది నిజమేనా అన్నట్టు… ప్రతీ వరల్డ్‌కప్‌లోనూ బ్లాక్ క్యాప్స్ కు పరాభవం తప్పడం లేదు. వరుసగా మూడు వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ ఆడిన న్యూజిలాండ్… ఎప్పుడూ ఆఖరి మెట్టుపై బోల్తా కొడుతూనే ఉంది. 2015లో మెక్‌కల్లమ్‌ సారథ్యంలో… 2019లో కేన్ కెప్టెన్సీలో వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్ చేరిన కివీస్… కప్ గెలవలేకపోయింది. 2021 T20 వరల్డ్‌కప్‌లోనూ కేన్‌ విలియమ్సన్‌ నేతృత్వంలో బ్లాక్‌ క్యాప్స్‌… ఫైనల్‌కు చేరి కూడా ట్రోఫీ గెలవలేకపోయారు. గుడ్డిలో మెల్ల అన్నట్లు… ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన టెస్టు చాంపియన్‌షిప్‌ను మాత్రం… కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్సీలో కివీస్ కైవసం చేసుకోగలిగింది.

Advertisement

ఇప్పుడు జరుగుతున్న T20 ప్రపంచకప్‌లోనూ న్యూజిలాండ్‌ మరోసారి ఫేవరెట్‌గా కనిపిస్తోంది. సూపర్‌-12 దశలో గ్రూప్‌-1లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని జట్టుగా కివీస్‌ సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో పాకిస్థాన్ పై గెలిస్తే… వరుసగా నాలుగోసారి వన్డే, T20 ఫైనల్ చేరిన జట్టుగా న్యూజిలాండ్ రికార్డు సృష్టిస్తుంది. ఆటగాళ్లలో హీరో లాంటి వాడు అని అభిమానులు పిలుచుకునే కేన్ విలియమ్సన్… మరి ఈసారైనా కప్పు గెలుస్తాడా? లేదా? అని… కివీస్ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×