E-Paper
Advertisement

Babar Azam: 5 సిక్సులతో బాబ‌ర్ ఆజం ఊచ‌కోత‌..లాహోర్ హైవేపైనే ప‌డ్డ బంతులు

Babar Azam: 5 సిక్సులతో బాబ‌ర్ ఆజం ఊచ‌కోత‌..లాహోర్ హైవేపైనే ప‌డ్డ బంతులు
Advertisement

Babar Azam:  పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ఫామ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రకటించిన జట్టులో బాబ‌ర్ ఆజంకు ( BABAR AZAM ) ఛాన్స్ దక్కింది. ఇటీవల బిగ్ బాష్ లీగ్ లో ఆడి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు బాబర్ ఆజం. అయినప్పటికీ బాబర్ ఆజంకు టి20 ప్రపంచ కప్ జట్టులో అవకాశం కల్పించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ నేపథ్యంలోనే బాబర్ ఆజం, నెట్స్ లో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ ప్రాక్టీస్ సమయంలో అత్యంత భయంకరంగా బ్యాటింగ్ చేస్తున్నాడట బాబర్ ఆజాం. ఇక నిన్న వరుసగా సిక్సులు కొట్టి, సొంత బౌలర్లకు చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. అబ్రార్ అహ్మద్ ( Abrar Ahmed) బౌలింగ్ లో ఏకంగా 5 సిక్సులు కొడితే, అన్ని బంతులు కూడా లాహోర్ హైవేల‌పై ప‌డ్డ‌ట్టు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు బాబ‌ర్ ఫ్యాన్స్‌.

Also Read: Abhishek Sharma vs Chris Gayle: అభిషేక్ శ‌ర్మ వ‌ర్సెస్ క్రిస్ గేల్..ఇందులో ఎవ‌రు రియ‌ల్ “యునివర్సల్‌ బాస్‌ “

అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో 5 సిక్సర్లు బాదిన బాబర్ ఆజం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ జట్టు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. లాహోర్ స్టేడియంలో పాకిస్తాన్ క్రికెటర్లందరూ బస చేస్తూ, రోజంతా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బాబర్ ఆజం, నెట్స్ లో అద్భుతంగా ఆడుతున్నాడట. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక నిన్న పాకిస్తాన్ కు చెందిన అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో ఐదు సిక్సర్లు బాదినట్లు బాబ‌ర్ ఆజం వీడియో వైరల్ గా మారింది. ప్రాక్టీస్ సందర్భంగా బాబర్ ఆజాంకు, రెండు ఓవర్లు వేశాడట అబ్రార్ అహ్మద్. ఈ రెండు ఓవర్లలో మొత్తం ఐదు సిక్సర్లు కొట్టాడట బాబర్ ఆజం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన పాకిస్తాన్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కంటే ముందు బాబ‌ర్ ఆజం ఫామ్ లోకి వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే ఊపు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో కొనసాగిస్తే పాకిస్తాన్ జట్టును ఆపడం ఎవరి తరం కాదంటూ విర్ర‌వీగుతున్నారు ఫాన్స్. అయితే, మ‌రి కొంత మంది మాత్రం బాబ‌ర్ ఆజంను ట్రోల్ చేస్తున్నారు. నెట్స్ లో కాదు, మ్యాచ్ లో ఆడాలని కౌంట‌ర్ ఇస్తున్నారు.

బీబీఎల్ లో బాబర్ ఆజం అట్ట‌ర్ ఫ్లాఫ్‌

బీబీఎల్ లో బాబర్ ఆజం అట్ట‌ర్ ఫ్లాఫ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆడిన 11 మ్యాచ్ ల‌లో కేవ‌లం 202 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. రెండు అర్ధ సెంచ‌రీలు మాత్రమే చేయ‌గా, ర‌న్ రేట్ చాలా త‌క్కువ‌గా ఉంది.

Advertisement

 

 

 

Also Read: BAN PAK – T20 World Cup: PCB తిక్క కుదిర్చిన ఐసీసీ.. టీ20 ప్ర‌పంచ క‌ప్ లో పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ ఎంట్రీ ?

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×