E-Paper
Advertisement

Babar Azam: 807 రోజులు, 83 మ్యాచ్ ల త‌ర్వాత బాబర్ ఆజం సెంచ‌రీ, వాళ్ల రికార్డులు అన్ని బ‌ద్ద‌లు

Babar Azam: 807 రోజులు, 83 మ్యాచ్ ల త‌ర్వాత బాబర్ ఆజం సెంచ‌రీ, వాళ్ల రికార్డులు అన్ని బ‌ద్ద‌లు
Advertisement

Babar Azam: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ( Babar Azam ) సరికొత్త చరిత్ర సృష్టించాడు. దాదాపు 807 రోజుల తర్వాత తన 32వ సెంచరీని నమోదు చేసుకున్నాడు బాబర్ ఆజం. గ‌త కొన్ని రోజులుగా ఫాం లేక బాబర్ ఆజం త‌డ‌బ‌డుతున్న సంగ‌త తెలిసిందే. ఈ త‌రుణంలోనే, దాదాపు 83 ఇన్నింగ్స్ ల‌ తర్వాత మళ్ళీ సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చాడు. పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ నేపథ్యంలో ఈ సరికొత్త రికార్డు సృష్టించాడు బాబర్ ఆజం. ఈ మ్యాచ్ లో 129 బంతుల్లో 102 పరుగులు చేసిన బాబర్ ఆజం, ఎనిమిది బౌండరీలు సాధించాడు. ఈ నేపథ్యంలోనే శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్ ను కూడా 2-0 పాకిస్తాన్ సొంతం చేసుకుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య చిట్ట చివరి వన్డే మ్యాచ్ మిగిలి ఉంది. నవంబర్ 16వ తేదీన అంటే రేపే చివరి మ్యాచ్ జరగనుంది.

Also Read: PAK VS SL: పాకిస్తాన్ లో చ‌చ్చినా ప‌ర్లేదు, మ్యాచ్ ఆడండి..లేక‌పోతే 2 ఏళ్ల బ్యాన్‌…శ్రీలంక బోర్డు హెచ్చ‌రిక‌లు

807 రోజులు, 83 మ్యాచ్ ల త‌ర్వాత బాబర్ ఆజం సెంచ‌రీ

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య ప్రస్తుతం 3 వన్డేల సిరీస్ జరుగుతోంది. ఇందులో ఇప్పటికే మొదటి వన్డేలో 6 వికెట్ల తేడాతో శ్రీలంక పై పాకిస్తాన్ విజయం సాధించింది. తాజాగా శుక్రవారం రోజున రావాల్పండి స్టేడియం వేదికగా రెండవ వ‌న్డే ఈ రెండు జట్ల మధ్య జరిగింది. ఇందులో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 288 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని 48.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్ ఛేదించింది. దీంతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది పాకిస్తాన్. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం సెంచరీ చేసిన నేపథ్యంలో సరికొత్త రికార్డులు నమోదు అయ్యాయి. 83 ఇన్నింగ్స్ ల తర్వాత వన్డేలలో తన 20వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంటే దాదాపు 807 రోజుల తర్వాత శతకం బాదేశాడు బాబర్ ఆజం. ఇక ఈ ఫామ్ ఇలాగానే బాబర్ ఆజం కొనసాగిస్తే, ఎప్పటిలాగానే పాకిస్తాన్ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడు.

వన్డేల్లో చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ లో మొత్తం 32 సెంచరీలు సాధించాడు. టెస్ట్ మ్యాచ్ ల‌లో మొత్తం 9 సెంచరీలు నమోదు చేసిన బాబర్ ఆజం ,వ‌న్డేలలో 20 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. టీ20 లలో మూడు సెంచరీలు చేసుకున్నాడు బాబర్. అయితే వన్డేల్లో ఇవాళ సెంచరీ చేయడంతో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు .

Advertisement

పాకిస్తాన్ వన్డే క్రికెట్ లో 20 సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ గా బాబర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 20 సెంచరీలు చేసిన స‌య్య‌ద్‌ అన్వర్ రికార్డు బద్దలు కొట్టాడు. బాబర్ కు ఈ 20 సెంచరీలు చేసేందుకు 136 ఇన్నింగ్స్ లు అవసరమైతే, అన్వర్ 244 ఆడాల్సి వచ్చింది. వీళ్ళిద్దరూ తర్వాత 15 సెంచరీలతో మహమ్మద్ యూసఫ్, 11 సెంచరీలతో నాలుగో స్థానంలో జమాన్, 11 సెంచరీలతో మహమ్మద్ హ‌ఫీజ్‌ 5వ స్థానంలో నిలిచారు.

Also Read: PAK vs SL 2nd ODI: ఇస్లామాబాద్ లో బ్లాస్టింగ్‌..పాకిస్తాన్ నుంచి పారిపోయిన 16 మంది శ్రీలంక ప్లేయ‌ర్లు, వ‌న్డే సిరీస్ ర‌ద్దు ?

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×