E-Paper
Advertisement

Babar Azam: టీమిండియాపై బాబ‌ర్ సెంచ‌రీ చేస్తే, బీఫ్ తినిపిస్తా..పాక్ మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

Babar Azam: టీమిండియాపై బాబ‌ర్ సెంచ‌రీ చేస్తే, బీఫ్ తినిపిస్తా..పాక్ మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం
Advertisement

Babar Azam: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND vs PAK ) మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య మాటలు యుద్ధం మొదలైంది. మేం గెలుస్తామంటే.. మేం గెలుస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ( Babar Azam) ఫామ్ పైన మాజీ క్రికెటర్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాబర్ ఆజం చెత్త ఫామ్ లో ఉన్నాడు. దాన్ని గుర్తు చేస్తూ, ఓ టీవీ డిబేట్ లో బాబ‌ర్ ను ఒక ఆట ఆడుకున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. ఇండియా పైన బాబర్ ఆజం సెంచరీ చేస్తే, బీఫ్ బిర్యానీ ( Beef Biryani) తినిపిస్తానని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ ( ahmed shehzad ) సవాల్ విసిరారు. ఇండియాను ఓడించేలా బాబర్ ఆజం ఇన్నింగ్స్ ఉంటే… అభిమానులందరికీ బిర్యానీ పెడతానని ప్రకటించాడు. దీంతో అహ్మద్ షెహజాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Trolls on Usman Tariq: ఐసీసీ కళ్లు మూసుకుపోయాయా ? ఉస్మాన్ తారిక్ పై బ్యాన్ వేయండి..USA, శ్రీలంక ఫ్యాన్స్ ట్రోలింగ్‌

బాబర్ సెంచరీ చేస్తే బిర్యానీ తినిపిస్తా

Advertisement

టీమిండియా తో ఈ నెల 15వ తేదీన పాకిస్తాన్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఈ మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు టీవీ డిబేట్ లో చర్చించారు. ఈ సందర్భంగా బాబర్ ఆజం గురించి కూడా ప్రస్తావన వచ్చింది. బాబర్ ఆజం ఫామ్ లేమిపై ఒక టీవీ చర్చలో అహ్మద్ స్పందించారు. బాబర్ గనుక టీమిండియాపై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడితే అందరికీ డిన్నర్ ఇస్తానని పందెం కాశారు అహ్మద్ షెహజాద్ ( ahmed shehzad ). అయితే, బాబ‌ర్ స‌రిగ్గా ఆడ‌క‌పోతే, మాత్రం రిటైర్మెంట్ ఇవ్వాల్సిందేనంటూ అమీర్ ట్రోల్ చేశారు. అటు ర‌షీద్ ల‌తిఫ్ మాత్రం బాబ‌ర్ ప‌రువు తీశాడు. వాడు ఇండియాతో జ‌రిగే మ్యాచ్ లో సెంచ‌రీ కాదు, డ‌కౌట్ అయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌ని ఇజ్జ‌త్ తీశాడు. దీంతో ఈ పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ల టీవీ చ‌ర్చ వైర‌ల్ గా మారింది. ఇది చూసిన బాబ‌ర్ ఫ్యాన్స్ సీరియ‌స్ అవుతున్నారు. ఏదో ఒక రోజు మా బాబ‌ర్ క‌లెక్ట‌ర్ అవుతాడు సార్‌… అన్న రేంజ్ లో కౌంట‌ర్లు ఇస్తున్నారు.

చెత్త ఫామ్ లో బాబ‌ర్ ఆజం

గ‌త రెండు ఏళ్లుగా బాబ‌ర్ ఆజం చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చుతున్నాడు. ఈ త‌రుణంలోనే పాక్ కెప్టెన్సీ నుంచి బాబ‌ర్ ను తొల‌గించారు. ఆ త‌ర్వాత జ‌ట్టులో కూడా స్థానం క‌నుమ‌రుగు అయింది.

Advertisement

Also Read: BAN – T20 WC Boycott: మా బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు, పిరికి స‌న్నాసులు..మాట మార్చిన ఆసిఫ్ నజ్రుల్

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×