E-Paper
Advertisement

Novak Djokovic : ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత జకోవిచ్…నాదల్ రికార్డు సమం..

Novak Djokovic : ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత జకోవిచ్…నాదల్ రికార్డు సమం..
Advertisement

Novak Djokovic : సెర్బియా టెన్నిస్‌ స్టార్ నొవాక్ జకోవిచ్‌ చరిత్ర సృష్టించాడు. పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. మొత్తంమీద తన ఖాతాలో 22వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ వేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ సమరంలో 6-3, 7-6, 7-6 తేడాతో సిట్సిపాస్‌పై జకోవిచ్‌ విజయం సాధించి ఆస్ట్రేలియన్‌ ఓపెన్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఈ టోర్నిలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన జకోవిచ్‌ తొలి మ్యాచ్ నుంచి దూసుకుపోయాడు. అయితే ఫైనల్‌లో తొలి సెట్‌ను సులువుగానే సొంతం చేసుకొన్న జకోవిచ్.. రెండు, మూడు సెట్లలో మాత్రం సిట్సిపాస్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. దీంతో రెండు, మూడు సెట్లు టై బ్రేక్‌ కు వెళ్లాయి. టై బ్రేక్ లో జకోవిచ్‌ పైచేయి సాధించి టైటిల్‌ను దక్కించుకొన్నాడు.

కరోనా వ్యాక్సిన్‌ వేసుకోకపోవడంతో గతేడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడకుండా జకోవిచ్ వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఏడాది మాత్రం అద్భుత ఆటతీరును జకోవిచ్‌ ప్రదర్శించాడు. మరో స్టార్ ఆటగాడు నాదల్ గాయం కారణంగా ఆరంభంలోనే ఇంటిముఖం పట్టాడు. ఇది కూడా జకోవిచ్‌కు కలిసొచ్చింది. అయితే ఫైనల్‌లో సిట్సిపాస్‌ నుంచి గట్టి పోటీనే తట్టుకొని టైటిల్‌ను సొంతం చేసుకొన్నాడు సెర్బియా స్టార్.

Advertisement

10వ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ గెలిచిన జకోవిచ్..7 వింబుల్డన్ ట్రోఫీలు సాధించాడు. అలాగే మూడుసార్లు యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచాడు. జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ మాత్రం రెండుసార్లే కైవసం చేసుకున్నాడు. ఇలా కెరీర్‌లో 22వ గ్రాండ్‌స్లామ్‌ను కైవసం చేసుకొని నాదల్‌ తో సమంగా నిలిచాడు.

Tags

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×