E-Paper
Advertisement

AUS VS NZ: 50 బంతుల్లోనే సెంచ‌రీ చేసిన‌ మిచెల్ మార్ష్‌…న్యూజిలాండ్ పై టీ20 సిరీస్ కైవ‌సం

AUS VS NZ: 50 బంతుల్లోనే సెంచ‌రీ చేసిన‌ మిచెల్ మార్ష్‌…న్యూజిలాండ్ పై టీ20 సిరీస్ కైవ‌సం
Advertisement

AUS VS NZ: న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడు టి20 ల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టి 20 సిరీస్ లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా.. సిరీస్ కైవసం చేసుకుంది. మొదటి అలాగే మూడవ టి20 లో గెలిచి సత్తా చాటింది. ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టి20 జరిగింది. ఇందులో మూడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు మిచెల్ మార్ష్‌ అద్భుతమైన సెంచరీ తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 52 బంతుల్లో 103 పరుగులు చేసి.. రఫ్ ఆడించాడు మిచెల్ మార్ష్‌.

Also Read: Shoaib Malik Divorce: మూడో భార్య‌కు కూడా షోయ‌బ్ మాలిక్ విడాకులు..? సానియా మీర్జా పాపం త‌గిలిందా !

మూడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆస్ట్రేలియా

Advertisement

న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో… మూడు వికెట్ల తేడాతో కంగారులు విజయం సాధించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్‌ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయగా, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్స్ నష్టపోయి 156 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో కాస్త తడపబడినా… 18 ఓవర్లలో ఫినిష్ చేసింది. 18 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయిన ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్‌ చివరి వరకు ఉండి జట్టును గెలిపించాడు.

50 బంతుల్లోనే సెంచ‌రీ చేసిన‌ మిచెల్ మార్ష్‌

న్యూజిలాండ్ జట్టుపై ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్‌ దుమ్ము రేపే బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. కేవలం 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు మిచెల్ మార్ష్‌. ఇందులో ఏడు సిక్సర్లతో పాటు 8 బౌండరీలు ఉన్నాయి. 198 తో రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్ లో మిగతా ఆస్ట్రేలియా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ కు ఔట్ కావడం జరిగింది. కానీ ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్‌ మాత్రం అద్భుతంగా రాణించాడు. చివరి వరకు అవుట్ కాకుండా… జట్టును గెలిపించాడు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టీ20 ల సిరీస్ లో…మిచెల్ మార్ష్‌ అద్భుతంగా రాణించాడు. మొదటి మ్యాచ్లో 43 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. రద్దయిన రెండో టి20 మ్యాచ్ లో 9 పరుగులకే నిరాశపరిచినా… మూడవ టి20 లో సెంచరీ చేశాడు. ఇది ఇలా ఉండ‌గా… న్యూజిలాండ్ తో టీ 20ల‌లో అద‌ర‌గొట్టిన మార్ష్ జ‌ట్టు… త్వ‌ర‌లోనే టీమిండియాతో వ‌న్డేలు, టీ20లు ఆడ‌నుంది. అది కూడా వాళ్ల సొంత గడ్డ అయిన ఆసీస్ లో ఈ మ్యాచ్ లు జ‌రుగ‌నున్నాయి. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ అద్భుతంగా రాణిస్తున్న నేప‌థ్యంలో.. వాళ్ల సొంత గ‌డ్డ‌పై టీమిండియా గెల‌వ‌డం క‌ష్టమేన‌ని అంటున్నారు. అయితే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ ఉంటే గెల‌వ‌చ్చ‌ని అంటున్నారు.

Advertisement

Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోద‌రి పెళ్లి చూసిన అభిషేక్ శ‌ర్మ

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×