E-Paper
Advertisement

Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్ట్ లో టీమిండియా దారుణ ఓటమి.. WTC పాయింట్స్‌ లో అగ్రస్థానానికి ఆసీస్‌ ! !

Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్ట్ లో టీమిండియా దారుణ ఓటమి.. WTC పాయింట్స్‌ లో అగ్రస్థానానికి ఆసీస్‌ ! !
Advertisement

Ind vs Aus 2nd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా పది వికెట్ల తేడాతో టీమిండియా పై విజయం సాధించింది కంగారు జట్టు. దీంతో ఐదు టెస్టులు సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది ఆస్ట్రేలియా జట్టు. ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు నుంచి అద్భుతంగా ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టు… టీమిండియా కు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. బౌలింగ్, బ్యాటింగ్ ఇలా రెండు రంగాల్లోనూ… కంగారు జట్టు అద్భుతంగా ఆడింది.

Also Read: Siraj vs Travis head: తగ్గేదేలే..హెడ్, DSP సిరాజ్ మధ్య వార్ ?

Advertisement

రెండో ఇన్నింగ్స్ లో… 19 పరుగుల లక్ష్యాన్ని… వికెట్ నష్టపోకుండా చేదించింది ఆస్ట్రేలియా. దీంతో.. రెండవ టెస్టులో టీమిండియా కు ఘోర ఓటమి తప్పలేదు. ఈ టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి రెండు జట్లకు ఉన్నప్పటికీ… టీమిండియా మాత్రం మొదటి టెస్టుల్లో గెలిచిన… ఓవర్ కాన్ఫిడెన్స్ తో బోల్తా పడింది. కానీ ఆస్ట్రేలియా మాత్రం ఖచ్చితంగా గెలవాలనే కసితో… ఆడింది. దీని ఫలితంగానే రెండవ టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

 

Advertisement

అడిలైడ్ టెస్ట్‌లో భారత్‌ ఘోర పరాజయం కావడానికి భారత్‌ బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు కారణం.అడిలైడ్ టెస్ట్‌లో భారత్‌ బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.
మొదటి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే భారత్‌ ఆలౌట్‌ కాగా… రెండో ఇన్నింగ్స్‌ లో కూడా పెద్దగా రాణించలేదు. టీమిండియా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగిన ఆసీస్‌ బౌలర్‌ స్టార్క్‌.. భారత ప్లేయర్ల నడ్డి విరిచాడు. ఇక అటు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌ 337 ఆలౌట్‌ కావడం జరిగింది.

ఈ ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌ లో హెడ్‌ 140 పరుగులు, లబుషేన్‌ 64, స్వీని 39 పరుగులు చేసి సత్తా చాటారు. అటు తొలి ఇన్నింగ్స్‌లో బూమ్రా, సిరాజ్‌ చెరో 4 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేసిన భారత్‌ బ్యాటర్లు… ఒకరి వెనుక మరొకరు పెవిలీయన్‌ కు దారి పట్టారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకే కుప్పకూలింది టీమిండియా. అటు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఆసీస్‌ కెప్టెన్‌ కమ్మిన్స్‌… భారత ప్లేయర్ల నడ్డి విరిచాడు.

దీంతో ఈ ఒక్క మ్యాచ్‌ లోనే… ఇద్దరూ ఆసీస్‌ బౌలర్లు రెచ్చిపోయి.. టీమిండియాను దెబ్బతీశారు. ఇక ఆసీస్‌ ముందు కేవలం 19 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన భారత్‌.. ఆ లక్ష్యాన్ని కాపాడుకులేని పరిస్థితి నెలకొంది. దీంతో 19 పరుగుల విజయలక్ష్యాన్ని వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది ఆసీస్‌. ఇక అటు భారత్‌కు ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించాడు నితీష్‌రెడ్డి. రెండో టెస్ట్‌లో స్టార్క్‌ 8, కమ్మిన్స్‌ 7, బోలాండ్‌కు 5 వికెట్లు పడగొట్టారు. ఇక టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మరో మూడు టెస్ట్‌లు ఉన్నాయి. ఇక ఈ గెలుపుతో.. WTC Points Tableలో మొదటి స్థానానికి చేరుకుంది ఆసీస్‌. టీమిండియా 3వ స్థానానికి చేరుకుంది.

Also Read: Pink Ball vs Red Ball: పింక్ బాల్ వర్సెస్ రెడ్ బాల్… వీటి మధ్య తేడా ఇదే!

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×