E-Paper
Advertisement

AUS vs PAK 3rd Test : మూడో టెస్ట్ లోనూ పాక్ ఓటమి .. 3 – 0తో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్

AUS vs PAK 3rd Test : మూడో టెస్ట్ లోనూ పాక్ ఓటమి .. 3 – 0తో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్
Advertisement
AUS vs PAK 3rd Test

AUS vs PAK 3rd Test : ఆస్ట్రేలియా గడ్డపై మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు వచ్చిన పాకిస్తాన్.. అన్నింటా ఓటమి పాలైంది. ఆఖరిదైన మూడో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో 130 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది.

విజయానికి మరో 11 పరుగుల దూరంలో స్టార్ ఓపెనర్, కెరీర్ చివరి మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే తను పెవెలియన్ కు వెళుతున్నప్పుడు అభిమానులు అందరూ లేచి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హెల్మెట్‌ను ముద్దాడుతూ తన స్టయిల్ లో వార్నర్ వెనుతిరిగాడు. అలా వెళుతూ ఓ యువకునిని తన హెల్మెట్, గ్లౌజులు బహుమతిగా ఇచ్చాడు. దాంతో ఆ కుర్రాడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

Advertisement

మూడో టెస్ట్ ప్రారంభంలో పాకిస్తాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అలా తొలి ఇన్నింగ్స్ లో 313 పరుగులు చేసింది. తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభమై తొలి ఇన్నింగ్స్ లో 299 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అలా పాకిస్తాన్ కు 14 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ దొరికింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ ఘోరంగా విఫలమైంది. 115 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

చివరికి ఆస్ట్రేలియా 130 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా డకౌట్ అయినప్పటికి, మరో  ఓపెనర్ డేవిడ్ వార్నర్ 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. లబూషేన్ 62 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. స్మిత్ (4) అండతో విజయం వైపు మ్యాచ్ ను నడిపించాడు.

Advertisement

దీంతో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్ స్వీప్ చేసి  ఘనంగా ముగించింది. ఆస్ట్రేలియాలో ఒక్క టెస్ట్ మ్యాచ్ అయినా గెలవాలనేది పాకిస్తాన్ 28 ఏళ్ల కల. ఈ సారి కూడా తీరకుండానే తిరుగు ముఖం పట్టనుంది.

మొన్న వరల్డ్ కప్ ఓటమి, నేడు టెస్ట్ సిరీస్ ఓటమితో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తల పట్టుకుంది. కెప్టెన్లను మార్చినా పరిస్థితుల్లో మార్పు  రావడం లేదని, అందుకు జట్టునే సమూలంగా మార్చాలని అప్పుడే నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది పీసీబీకి ఊపిరాడకుండా చేస్తోంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×