E-Paper
Advertisement

Asian Championship: ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియా విజయం.. 8వ సారి..

Asian Championship: ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియా విజయం.. 8వ సారి..
Advertisement

Asian Championship: కబడ్డీ అనేది ఒకప్పుడు గ్రామాల్లో బాగా ఫేమస్ అయిన ఆట. ఆ తర్వాత ఇది ప్రపంచదేశాల వరకు వెళ్లింది. ప్రస్తుతం ఈ ఆటలో ఛాంపియన్‌షిప్స్ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోని ఎన్నో కబడ్డీ ఛాంపియన్‌షిప్స్‌లో ఇండియా తన సత్తాను చాటుకుంది. తాజాగా మరోసారి ఇండియన్ కబడ్డీ టీమ్‌కు ఎవరూ సాటి రారని నిరూపించింది. తాజాగా జరిగిన ఏషియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో ఇండియన్ టీమ్.. 8వ సారి పతకాన్ని సాధించింది.

ఏషియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్స్ అనేవి ప్రారంభమయ్యి తొమ్మిదేళ్లే అయ్యింది. ఆ తొమ్మిదేళ్లలో 8 సార్లు ఇండియన్ టీమే గోల్డ్ మెడల్ గెలవడం విశేషం. ఈసారి జరిగిన ఛాంపియన్‌షిప్స్‌లో ఇరాన్ టీమ్‌ను ఇండియా ఓడించి ఘన విజయం సాధించింది. ఇరాన్‌కు, ఇండియాకు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ థ్రిల్లింగ్‌గా సాగింది. సౌత్ కొరియాలోని బూసాన్ డోగ్ యూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్యోక్‌డ్యాంగ్ కల్చరల్ సెంటర్‌లో ఈ ఫైనల్ మ్యాచ్ చోటుచేసుకుంది.

Advertisement

ఏషియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో ఇండియా అనేది మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ టీమ్‌గా పేరు తెచ్చుకుంది. తాజాగా అందుకున్న విజయంతో మరోసారి ఈ విషయాన్ని నిరూపించుకుంది ఇండియన్ కబడ్డీ టీమ్. ఫైనల్ మ్యాచ్ మొదలైన తర్వాత ఇరాన్ స్కోర్ విషయంలో దూసుకుపోయింది. దీంతో ఇండియా ఓడిపోతుందని అనుకున్నారంతా. కానీ ఇండియన్ డిఫెండర్స్ చాలా చాకచక్యంతో మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఏషియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో ఇండియా.. అవతలి టీమ్‌ను ఆల్ ఔట్ చేయడం ఇది 10వ సారి.

ఫైనల్‌లో మొదటి రౌండ్ పూర్తయ్యే సమయానికి 23-11 పాయింట్స్‌తో ఇండియా ఆధిక్యంలో ఉంది. సెకండ్ రౌండ్‌లో ఇరాన్ మధ్య మధ్యలో తన స్పార్క్‌ను చూపించిన ఇండియా చేసిన హై స్కోర్‌ను బీట్ చేయడం మాత్రం వారికి కష్టమయ్యింది. ఇండియా సాధించిన ఈ విజయాన్ని ప్రేక్షకులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కబడ్డీనే తమ లక్ష్యంగా పెట్టుకునే ఎంతోమంది ఆటగాళ్లకు ఇండియన్ కబడ్డీ టీమ్ స్ఫూర్తినిస్తుందంటున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×